హోమ్లీ లుక్స్ తో ‘ఆండ్రియా జెరెమియా’ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆండ్రియాకి మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా గతంలో ఆమె చేసిన పాత్రలు కూడా ఆమెకు డీసెంట్ ఇమేజ్ రావడానికి ఉపయోగపడింది. అయితే, ఇలాంటి ఫ్యామిలీ బ్యూటీ, న్యూడ్ సీన్‌లో నటిస్తోందనే వార్త, ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
తమిళ చిత్రసీమలోని గాయనిగా, హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించుకున్న ‘ఆండ్రియా జెరెమియా’కి న్యూడ్ సీన్ లో నటించాల్సిన అవసరం ఏమిటి ? అంటూ నెటిజన్లు డౌట్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నా.. సినీ వర్గాల నుండి లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఆండ్రియా నిజంగానే న్యూడ్ సీన్ లో నటించబోతుందట. ఆండ్రియా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘పిశాసు-2’ చిత్రం కోసం ఆమె ఈ డేరింగ్ స్టెప్ తీసుకుందట.
థ్రిల్లర్ డైరెక్టర్ మిష్కిన్ దర్శకత్వంలో 2016లో విడుదలైన ‘పిశాసు’ చిత్రానికి ఇది సీక్వెల్. అయితే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒకానొక సందర్భంలో ఆండ్రియా నగ్నంగా నటించాల్సిన కీలక సీన్ ఒకటి ఉందట. కథ డిమాండ్ చేయడంతో పైగా దర్శకుడు మిష్కిన్ సెట్ లో ఎవరిని ఎలౌవ్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని మాట ఇవ్వడంతో మొత్తానికి ఆండ్రియా న్యూడ్ గా కనిపించడానికి అంగీకరించింది.
జులై ఫస్ట్ వీక్ నుండి ఈ న్యూడ్ సన్నివేశాలను చిత్రీకరించే ప్లాన్ లో దర్శకనిర్మాతలు ఉన్నారట. ఇక ఆండ్రియా న్యూడ్ సీన్స్, ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక గత 2019లో ‘ఆడై’ చిత్రం కోసం అమలాపాల్ నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. అయితే, ఆమె న్యూడ్ సీన్స్ ను సినిమాలో ఎడిట్ చేశారు. కానీ ఆండ్రియా సీన్స్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎడిట్ లో లేదా సెన్సార్ లో పోకుండా మిష్కిన్ పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు పోతున్నాడట.