Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: ముఖమంతా రక్తం కారుతూ.. దెబ్బలతో అనసూయ.. అసలేమైంది.. షాకింగ్ పిక్స్ వైరల్

Anasuya Bharadwaj: ముఖమంతా రక్తం కారుతూ.. దెబ్బలతో అనసూయ.. అసలేమైంది.. షాకింగ్ పిక్స్ వైరల్

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ వేదికగా ఆమె అనేక సంచలనాలు చేసింది. బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన తొలి తెలుగు యాంకర్ అని చెప్పొచ్చు. 2013లో మొదలైన జబర్దస్త్ షో అనేక రికార్డులు నెలకొల్పింది. యూట్యూబ్ లో జబర్దస్త్ కామెడీ వీడియోలు మిలియన్స్ వ్యూస్ రాబట్టేవి. జబర్దస్త్ సక్సెస్ లో అనసూయ క్రెడిట్ చాలా ఉంది. ఆమె కురచ దుస్తుల్లో గ్లామర్ ఒలకబోచేది. ఒక దశలో అనసూయ పొట్టిబట్టలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

అనసూయ మాత్రం తీరు మార్చుకోలేదు. పైగా నా బట్టలు నా ఇష్టం. నన్ను జడ్జి చేయడానికి మీరెవరు అంటూ ఆమె ఎదురుదాడి చేస్తుంది. అది తన ఆత్మ విశ్వాసానికి ప్రతీక గా చెప్పుకుంటుంది. 2022లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. కొన్నాళ్ళు టెలివిజన్ షోలకు పూర్తిగా దూరమైంది. ఇటీవల కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షోతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో కూడా అనసూయ తన మార్క్ గ్లామర్ షో చేస్తుంది.

అలాగే నటిగా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. అనసూయపై సోషల్ మీడియాలో నెగిటివిటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఆమె చేసిన ప్రతి కామెంట్, షేర్ చేసిన ప్రతి ఫోటో, వీడియోలను ట్రోల్ చేసేవారున్నారు. హేటర్స్ ని మరింత రెచ్చగొట్టేలా అనసూయ సోషల్ మీడియా పోస్ట్స్ ఉంటాయి. చెప్పాలంటే అనసూయకు శత్రువులు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో అనసూయ గాయాలతో కనిపించడం ఆందోళనకు గురి చేసింది. అనసూయ ముఖం రక్త సిక్తం గా మారింది. రక్తం కారుతూ ఆమె ఒకింత ప్రమాదంలో పడినట్లు కనిపించారు.

గాయాలతో ఉన్న ఫోటోలను అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే అది నిజమైన గాయాలు కాదని తెలుస్తుంది. అనసూయ ఓ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వాటిలో గాయాలతో ఉన్నట్లు భ్రమింపజేసే ఫోటోలు కూడా ఉన్నాయి. అనసూయ లేటెస్ట్ మూవీ సింబా. జగపతిబాబు, గౌతమి, అనసూయ కీలక రోల్స్ చేశారు.

సింబా మూవీ నేడు విడుదలైంది. ఈ మూవీకి ప్రమోషన్స్ కల్పించడం కోసం సెట్స్ లో దిగిన ఫోటోలు అనసూయ షేర్ చేసింది. సన్నివేశంలో భాగంగా అనసూయ గాయాలతో కూడిన మేకప్ ధరించింది. ఆ ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకుని కంగారు పెట్టింది. సింబా చిత్రానికి మురళి మనోహర్ దర్శకుడు. అనసూయ సీరియస్ రోల్ చేసింది. ఓ సోషల్ బర్నింగ్ పాయింట్ ఆధారంగా సింబా చిత్రాన్ని తెరకెక్కించారు. సింబా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

కాగా అనసూయ చేతిలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు ఉన్నాయి. పుష్ప 2 ఆమె నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో అనసూయ నెగిటివ్ రోల్ చేసింది. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ పుష్పకు కొనసాగింపుగా పుష్ప 2 తెరకెక్కింది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దాక్షాయణిగా పుష్ప 2 చిత్రంలో అనసూయ అలరించనుంది. పుష్ప 2 పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

RELATED ARTICLES

Most Popular