Homeఎంటర్టైన్మెంట్Anchor Anasuya Latest Photos: చీర కట్టులో అనసూయ అందాలు చూడతరమా... గ్లామరస్ యాంకర్ బెస్ట్...

Anchor Anasuya Latest Photos: చీర కట్టులో అనసూయ అందాలు చూడతరమా… గ్లామరస్ యాంకర్ బెస్ట్ శారీ లుక్స్

Anchor Anasuya Latest Pics : అనసూయ భరద్వాజ్ ఫ్యాషన్ ఐకాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడరన్ డ్రెస్సులో మెస్మరైజ్ చేసే అనసూయ… సాంప్రదాయ చీరకట్టులో సైతం కట్టిపడేస్తుంది. అనసూయ భరద్వాజ్ బెస్ట్ శారీ లుక్స్ మీకోసం..

తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ఘనత అనసూయదే. జబర్దస్త్ వేదికగా అనసూయ(Anasuya Bharadwaj) ఫ్యాషన్ ప్రియులకు ట్రీట్ ఇచ్చింది. పొట్టి బట్టల్లో గ్లామర్ ఒలకబోస్తూ జబర్దస్త్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కొంది. అనసూయ డ్రెస్సింగ్ పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. అయినప్పటికీ అనసూయ ఏనాడూ తగ్గింది లేదు. పైగా విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. తన డ్రెస్ ని జడ్జి చేసే హక్కు ఎవరికీ లేదంటుంది అనసూయ.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

నా బట్టలు నా ఇష్టం. నేను ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి మీరెవరు అని ఫైర్ అవుతుంది. నాకు సౌకర్యంగా అనిపిస్తే చాలు. ఎలాంటి బట్టలైనా ధరిస్తాను అని నిర్మొహమాటంగా చెబుతుంది. అది నిరూపించింది కూడాను. అనసూయ శరీరాకృతికి బికినీ ధరించడం సాహసమే. ఫ్యామిలీ వెకేషన్ లో బికినీ వేసుకున్న అనసూయ, ఆ ఫోటోలు ధైర్యంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అనసూయ ఆత్మవిశ్వాసానికి అది నిదర్శనం. మనకు నచ్చినట్లు మనం బ్రతకాలి, ఎదుటి వాళ్ళ కోసం కాదనే ఫిలాసఫి ఆమె ఫాలో అవుతుంది.

అనసూయ సాంప్రదాయ చీరకట్టులో అద్భుతంగా ఉంటుంది. అనసూయ శారీ లుక్స్ పలుమార్లు వైరల్ అయ్యాయి. చీరకట్టుకే అనసూయ అందం తెచ్చింది అంటే అతిశయోక్తి కాదు. మరోవైపు అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. నటిగా విలక్షణ పాత్రలు చేస్తూ వెండితెరపై సత్తా చాటుతుంది. రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలు అనసూయకు మంచి పేరు తెచ్చాయి. కొన్ని చిత్రాల్లో అనసూయ లీడ్ రోల్స్ సైతం చేయడం విశేషం.

Also Read: సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ వీడియో..పవన్ లుక్స్ మామూలుగా లేవుగా!

కొన్నాళ్ళు అనసూయ యాంకరింగ్ కి దూరంగా ఉంది. జబర్దస్త్(Jabardasth) తో పాటు పలు షోల నుండి తప్పుకుంది. ఈ పరిణామం బుల్లితెర ఆడియన్స్ ని నిరాశకు గురిచేసింది. అయితే గత ఏడాది ఆమె రీఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ గేమ్ షోలో అమ్మాయిలకు రిప్రెజెంట్ గా అనసూయ వ్యవహరించింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 ఇటీవల ముగియగా అనసూయ సందడి చేసింది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ షోలో కూడా అనసూయ సందడి చేయడం విశేషం.

RELATED ARTICLES

Most Popular