Southern States Funding: భారత దేశం ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాతిల ప్రాంతాల సమూహం. దేశాన్ని ఉత్తర, దక్షిణ, తూర్పు, ఈశాన్య భారత దేశాలుగా విభజించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు పెద్దన్న. అభివృద్ధి, నిధుల కేటాయింపు, రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల మంజూరు, విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇలా అన్నీ కేంద్రం చేతిలో ఉంటాయి. ఇక కేంద్రం రాష్ట్రాల నుంచి కూడా పన్నుల రూపొంలో ఆదాయం పొందుతుంది. ఇదే ఆదాయం నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు కేటాయిస్తుంది. అయితే నిధుల కేటాయింపులో వివక్ష ఇప్పుడు చర్చనీయాంశమైంది. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండడంతో అధిక పనులు చెల్లించే రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా అమలు చేసిన జనాభా నియంత్రణే ఇప్పుడు ఈ రాష్ట్రాలకు షాపంగా మారింది.
ఆర్థిక సంఘం సిఫారసులు…
కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఆర్థిక సంఘం సిఫారసులు, రాష్ట్రాల జనాభా, ఆర్థిక అవసరాలు, అభివృద్ధి సూచికలు, ఇతర ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ) తక్కువ నిధులు పొందుతున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాలు జనాభా నియంత్రణను పటిష్టంగా అమలు చేశాయి. దీంతో జనాభా ఫెరుగుదల స్థిరంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షినాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ. కేంద్రం జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండడంతో దక్షిణాధి రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు (ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటివి) ఎక్కువ జనాభా కలిగి ఉండటంతో వాటికి నిధుల వాటా ఎక్కువగా కేటాయించబడుతుంది.
పను కేటాయింపు విధానం..
జీఎస్టీ వాటా..
జీఎస్టీ కింద సేకరించిన పన్నుల్లో రాష్ట్రాలకు కేంద్రం 50 శాతం కేటాయిస్తుంది. మిగిలిన 50 శాతం కేంద్రం వద్ద ఉంటుంది, ఇందులో కొంత భాగం రాష్ట్రాల పరిస్థితుల ఆధారంగా తిరిగి కేటాయించబడుతుంది.
Also Read: Banakacharla Project : బనకచర్ల : ఏపీ, తెలంగాణ మధ్య ఓ వరదనీటి వివాద కథ
గ్రాంట్లు..
ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా రాష్ట్రాలకు అదనపు గ్రాంట్లు కూడా అందించబడతాయి. అయితే ఈ గ్రాంట్లలో చాలా వరకు ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయి. పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఎక్కువ నిధులు ఇస్తుండగా, రాష్ట్రాలకు తిరిగి వచ్చేది చాలా తక్కువ.
- ఉత్తరప్రదేశ్ : 17.939% (అత్యధిక జనాభా కారణంగా ఎక్కువ వాటా)
- బీహార్ : 10.058%
- మధ్యప్రదేశ్ : 7.851%
- మహారాష్ట్ర : 6.321%
- రాజస్థాన్ : 5.979%
- పశ్చిమ బెంగాల్ : 5.095%
- తమిళనాడు : 4.189%
- ఆంధ్రప్రదేశ్ : 4.111%
- కర్ణాటక : 3.647%
- తెలంగాణ : 2.133%
- కేరళ : 1.925%
- సిక్కిం : 0.395% (అతి తక్కువ వాటా)
దక్షిణాది రాష్ట్రాల ఫిర్యాదు..
దక్షిణాది రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ) కేంద్రానికి ఎక్కువ పన్ను ఆదాయం అందిస్తాయి (ముఖ్యంగా జీఎస్టీ, ఆదాయపు పన్ను ద్వారా). మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు జీఎస్టీ సేకరణలో అత్యధిక వాటాను అందిస్తాయి, కానీ వాటి జనాభా తక్కువ కావడం వల్ల తిరిగి పొందే నిధులు తక్కువగా ఉంటాయి. తమిళనాడు, తెలంగాణ కూడా ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు. అయితే జనాభా ఆధారిత కేటాయింపు వల్ల తక్కువ నిధులు పొందుతున్నాయి.
మహారాష్ట్ర జీఎస్టీలో 20 శాతం(రూ.2.5 లక్షల కోట్లు) కేంద్రానికి చెల్లిస్తుండగా కేంద్రం కేవలం రూ.50 వేల కోట్లు తిరిగి ఇస్తుంది. ఉత్తర ప్రదేశ్ జీఎస్టీ కేవలం 7 శాతం కేంద్రానికి ఇస్తుండగా ఆ రాష్ట్రానికి కేంద్రం తిరిగి రూ.1.2 లక్షల కోట్లు ఇస్తుంది. కారణం జనాభా.
Also Read: Ashok Gajapathi Raju latest news: అశోక్ గజపతిరాజు కోసం రాష్ట్రపతి కార్యాలయం పడిగాపులు!
నియోజకవర్గాల పునర్విభజన విషయంలోనూ..
ఇక నియోజకవర్గాల పునర్భిజన విషయంలోనూ ఇలాగే అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన విభజన చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఏర్పడతాయి. దక్షిణాదిలో తక్కువగా ఏర్పడతాయి. దీంతో భవిష్యత్‌లో దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే నిధుల కేటాయింపులో మరింత అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ .