
బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలియా ఒప్పుకోవాలే గాని హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. ఆ స్థాయిలో అలియాకి యూత్ లో ఫాలోయింగ్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ అలియాని అభిమానించే వారు హిందీ చిత్రపరిశ్రమలో ఎక్కువుగా ఉన్నారు. అందుకే, ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీయాలని మేకర్స్ ఫిక్స్ అయితే.. మొదటి ఆప్షన్ గా పెట్టుకుంటుంది మాత్రం అలియానే. అంతలా అలియా రేంజ్ రోజురోజుకూ పెరిగిపోతుంది.
Also Read: మెగాస్టార్ కి ఈ వయసులో ఒకేసారి రెండు అంటే.. ?
అయితే అలియా ఇక నుండి సినిమాలకు దూరం అవుతుందట. తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ను వివాహం చేసుకుని సినిమాలు వదిలేస్తోందట. అందుకే కొత్తగా ఏ సినిమాలను ఒప్పుకోవడం లేదట. శంకర్ – చరణ్ సినిమాలో హీరోయిన్ గా అలియానే అనుకుంటున్నారు. పైగా శంకర్ ఆమె కోసం ప్రత్యేకంగా ముంబై వెళ్లి మరీ కథ చెప్పి.. డేట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడట. అయినా దయచేసి సినిమా చేయలేని.. పర్సనల్ లైఫ్ కారణంగా.. ఇక నుండి సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిందట.
Also Read: విజయ్ దేవరకొండ థియేటర్లో.. పవన్ కల్యాణ్ బొమ్మ!
అందుకే ఇప్పటికే ఒప్పకున్న సినిమాలను పూర్తి చేయడానికి నానాకష్టాలు పడాల్సి వస్తోంది. అన్నట్టు అలియా బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. రణబీర్ ప్రస్తుతం క్వారెంటైన్లో ఉన్నాడు. అలియా భట్ కి నెగెటివ్ అని తేలింది. అందుకే ఆమె షూటింగ్ లో పాల్గొంటోంది. ఆర్ఆర్ ఆర్ కి ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చేసింది. రాజమౌళి ఇప్పటికే ఈ సినిమాలోని అలియా భట్ మొదటి లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్