Homeఎంటర్టైన్మెంట్Alpha Box Office Collection : అలియా భట్ 'ఆల్ఫా' 4 రోజుల వరల్డ్ వైడ్...

Alpha Box Office Collection : అలియా భట్ ‘ఆల్ఫా’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Alpha Box Office Collection : ఒకప్పుడు బాలీవుడ్ లో స్పై జానర్ సినిమాలకు ఏ రేంజ్ క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ ఈ జానర్ సినిమాల కోసం మెంటలెక్కిపోయే వారు. అందులోనూ యాష్ రాజ్ ఫిలిమ్స్ నుండి వచ్చే స్పై యూనివర్స్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉండేది. అయితే ఆ బ్రాండ్ ఇప్పుడు మసకబారింది. ‘పఠాన్’ చిత్రం తోనే ఈ స్పై యూనివర్స్ కి క్రేజ్ పడిపోయింది. ‘పఠాన్’ […]

Alpha Box Office Collection : ఒకప్పుడు బాలీవుడ్ లో స్పై జానర్ సినిమాలకు ఏ రేంజ్ క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ ఈ జానర్ సినిమాల కోసం మెంటలెక్కిపోయే వారు. అందులోనూ యాష్ రాజ్ ఫిలిమ్స్ నుండి వచ్చే స్పై యూనివర్స్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉండేది. అయితే ఆ బ్రాండ్ ఇప్పుడు మసకబారింది. ‘పఠాన్’ చిత్రం తోనే ఈ స్పై యూనివర్స్ కి క్రేజ్ పడిపోయింది. ‘పఠాన్’ తర్వాత విడుదలైన ‘టైగర్ 3’, ‘వార్ 2’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక ఇదే యూనివర్స్ లో రీసెంట్ గా విడుదలైన చిత్రం ‘ఆల్ఫా ‘. అలియా భట్ , శార్వరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ లేడీ ఓరిటెంటెడ్ మల్టీస్టార్రర్ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. మొదటి రోజు ఈ చిత్రానికి ఇండియా వైడ్ 9 కోట్ల 12 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, 2 వ రోజున 11 కోట్ల 50 లక్షలు , 3 వ రోజున 12 కోట్ల 86 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. టాక్ డివైడ్ గా వచ్చినప్పటికీ మొదటి వీకెండ్ లో 33 కోట్ల 38 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి పర్వాలేదు అనిపించుకుంది. కానీ నాల్గవ రోజున మాత్రం ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి నాల్గవ రోజున కేవలం 3 కోట్ల 80 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ గా 37 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను ఈ చిత్రం నాలుగు రోజుల్లో రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి మొదటి మూడు రోజులకు కలిపి 1.55 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అంటే 14 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. నాలుగు రోజులకు కలిపి 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాని నిర్మించడానికి 130 కోట్ల రూపాయిల బడ్జెట్ ఖర్చు అయ్యింది. నిర్మాతకు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ని చూస్తుంటే అసాధ్యమని అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper