Akkineni Nagarjuna and CM Revanth : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అందరు అంటూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులకు, సినీ తారలకు మధ్య కూడా ఇలాంటి సంబంధాలే ఉంటాయా?, ఏమో ఉండొచ్చేమో అని అక్కినేని నాగార్జున, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లను చూస్తుంటే అర్థం అవుతుంది. అక్కినేని నాగార్జున కి అత్యధిక లాభాలు తెచ్చి పెట్టే వ్యాపారాల్లో ఒకటి N కన్వెన్షన్ హాల్. హైదరాబాద్ లో ఇది చాలా ఫేమస్. ఎంతో మంది ప్రముఖుల పెళ్లిళ్లు, మరియు ఇతర ఫంక్షన్స్ ఇందులోనే జరిగేవి. అంతెందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుమార్తె పెళ్లి కూడా గతం లో ఇక్కడే జరిగింది. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు, నాగార్జున(Akkineni Nagarjuna) కు కోట్ల రూపాయల్లో లాభాలు వచ్చేవి. అలాంటి N కన్వెన్షన్ హాల్ ని రేవంత్ రెడ్డి అద్వర్యం లో నడిచే హైడ్రా సంస్థ ఒక్క గంటలో నేలమట్టం చేసేసింది.
Also Read : నాగార్జున వెళ్ళిపోయినప్పుడే బిగ్ బాస్ కి మంచి రోజులు వస్తాయి – సోనియా
అక్రమ కట్టడాల క్రింద ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇది జరిగిన కొన్నాళ్ళకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో మంత్రిగా పని చేస్తున్న కొండా సురేఖ నాగార్జున ని ఆయన కుటుంబాన్ని ఎంత నీచాతి నీచంగా మాట్లాడిందో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. కేటీఆర్ వద్దకు సమంత ని నాగార్జున పంపలేదని నాగార్జున విడాకులు ఇవ్వమన్నాడని, అందుకే సమంత నాగ చైతన్య కు విడాకులు ఇచ్చిందని పబ్లిక్ గా మీడియా ముందు మాట్లాడింది. దీనిపై నాగార్జున మరియు అక్కినేని ఫ్యామిలీ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నాగార్జున నాంపల్లి కోర్టు లో కొండా సురేఖ పై పరువు నష్టం దావా కూడా వేసాడు. ఇక నాగార్జున కి సపోర్ట్ గా ఇండస్ట్రీ మొత్తం కలిసొచ్చింది. నాగార్జున స్థానం లో మనం ఉండుంటే, రేవంత్ రెడ్డి కనిపిస్తే చూసి చూడకుండా వెళ్లిపోయేవాళ్ళం ఏమో. కానీ నాగార్జున మాత్రం రేవంత్ రెడ్డి తో చాలా సన్నిహితంగా మెలగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ముందుగా సినీ ప్రముఖలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించేందుకు నాగార్జున కూడా వెళ్ళాడు. అప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేకంగా శాలువా కప్పి సన్మానం చేసాడు. ఇక నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ 2025 – తెలంగాణ సెలబ్రేటింగ్ బ్యూటీ అండ్ కల్చర్ కార్యక్రమానికి వీళ్లిద్దరు హాజరు అయ్యారు. పక్క పక్కనే కూర్చొని ముచ్చట్లు ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. దీనిపై ఎన్నో భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. జరిగిన సంఘటనలలో నాగార్జున కంటే వైల్డ్ గా రియాక్ట్ అయ్యింది ఆయన సతీమణి అమల. ఆమె కూడా రేవంత్ రెడ్డి పక్కనే కూర్చోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. దీనిని బట్టీ అభిమానులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ బాగానే ఉంటారు, మధ్యలో వాళ్ళ కోసం మనం పోరాటం చేయడమే వ్యర్థం అనేది అర్థం చేసుకోవాలి.
Also Read : రేవంత్ రెడ్డిది.. నిజాయతీ లేక నిస్సహాయత?
మిస్ వరల్డ్ 2025 – తెలంగాణ సెలబ్రేటింగ్ బ్యూటీ అండ్ కల్చర్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, హీరో అక్కినేని నాగార్జున pic.twitter.com/uhVNkyGrq9
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2025