Sobhita Dhulipala : అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే దాదాపుగా రెండేళ్లు కావొస్తుంది. ఈ రెండేళ్ల వైవాహిక జీవితంలో , వీళ్లిద్దరు ఎంతో అన్యోయంగా గడుపుతూ వస్తున్నారు. శోభిత అక్కినేని కుటుంబం లోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా , అక్కినేని ఫ్యామిలీ లోని హీరోలందరికీ వరుసగా సూపర్ హిట్స్ నమోదు అవుతున్నాయి. అంతే కాకుండా వ్యాపారపరమైన విషయాల్లో కూడా అక్కినేని ఫ్యామిలీ మునుపెన్నడూ చూడని పీక్ ని చూస్తోంది. ఓవరాల్ గా శోభిత ఎంట్రీ ఆ కుటుంబం లో పెద్ద శుభపరిణామం అనే చెప్పొచ్చు. అయితే పెళ్లి తర్వాత శోభిత సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహం ఉండేది. కానీ పెళ్ళికి ముందు ఆమె ఎలా అయితే సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ గా ఉండేదో , పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటోంది.
కానీ ఈమె తెలుగు సినిమాల్లో కానీ , వెబ్ సిరీస్ లలో కానీ అసలు నటించడం లేదు. ఆమె ఫోకస్ మొత్తం హిందీ , తమిళం బాషలపైనే ఉంది. లేటెస్ట్ గా ఆమె ప్రాజెక్ట్స్ కూడా బాలీవుడ్ కి సంబంధించినవే అవ్వడం విశేషం. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు వివిధ భాషల్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒక కథ ఒప్పుకునే ముందు, మీతో పాటు , మీ భర్త నాగ చైతన్య కూడా వింటారా ?, ఆయన ఓకే చెప్పిన తర్వాతే మీరు ప్రాజెక్ట్ కి సైన్ చేస్తారా ?’ అని అడగ్గా, అందుకు శోభిత సమాధానం చెప్తూ ‘ అసలు కాదు. నేను కానీ , నాగ చైతన్య కానీ వృత్తిపరంగా స్వేచ్ఛ కోరుకునేవాళ్ళం. అతని సినిమాల కథల చర్చల్లో నేను దూరను, నా కెరీర్ విషయం లో కూడా అతను దూరడు’.
‘కెరీర్ పరంగా మేమిద్దరం ఎవరి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటాం. ఇద్దరం ఇంట్లో మేము చేసే పనుల గురించి చర్చించుకుంటాం కానీ, ఒకరి కెరీర్ విషయం లో మరొకరు జోక్యం చేసుకోవడం వంటివి అసలు జరగదు. అక్కినేని కోడలు అయ్యినంత మాత్రానా కెరీర్ పరమైన నిర్ణయాల కోసం భర్త అనుమతి అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు శోభిత. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. భార్య భర్తలు అన్నప్పుడు ఈ మాత్రం అర్థం చేసుకునే తత్త్వం ఉండాలి , అప్పుడే ఎలాంటి గొడవలు లేకుండా రిలేషన్ చాలా సాఫ్ట్ గా ముందుకు వెళ్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్.
