Homeజాతీయ వార్తలుPrashant Kishor: జెన్ జెడ్ పోరాటం.. బిజెపి పని ఖతం.. ప్రశాంత్ కిషోర్ ఇది ఊహించలేదు..

Prashant Kishor: జెన్ జెడ్ పోరాటం.. బిజెపి పని ఖతం.. ప్రశాంత్ కిషోర్ ఇది ఊహించలేదు..

Prashant Kishor: జెన్ కొద్దిరోజులుగా మనదేశంలో జనరేషన్ జెడ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. నీట్ పేపర్ లీకేజీ తర్వాత జనరేషన్ జెడ్ తరంలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. అందువల్లే జంతర్ మంతర్ వేదికగా రోజులపాటు కేంద్రానికి వ్యతిరేకంగా యువకులు ఉద్యమాలు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా యువకులు శాంతించడం లేదు. ఇప్పుడు అదే ఆగ్రహాన్ని బీజేపీ మీద మరో రూపంలో చూపించారు జనరేషన్ జెడ్ […]

Prashant Kishor: జెన్ కొద్దిరోజులుగా మనదేశంలో జనరేషన్ జెడ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. నీట్ పేపర్ లీకేజీ తర్వాత జనరేషన్ జెడ్ తరంలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. అందువల్లే జంతర్ మంతర్ వేదికగా రోజులపాటు కేంద్రానికి వ్యతిరేకంగా యువకులు ఉద్యమాలు చేశారు.

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా యువకులు శాంతించడం లేదు. ఇప్పుడు అదే ఆగ్రహాన్ని బీజేపీ మీద మరో రూపంలో చూపించారు జనరేషన్ జెడ్ యువకులు. బిజెపి ఊహించిన విధమైన ఫలితాన్ని ఇచ్చి చుక్కలు చూపించారు. వాస్తవానికి ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.

బీహార్ రాష్ట్రంలో బంకిపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ గెలవడానికి బిజెపి.. ఆర్జెడి.. జన్ సూరజ్ పార్టీలు తీవ్రంగా పోరాటం చేశాయి. జన్ సూరజ్ పార్టీ నుంచి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పోటీలో ఉన్నారు. పైగా ఈ నియోజకవర్గంలో 1995 నుంచి బిజెపి ఒక్కసారి కూడా ఓడిపోలేదు.

ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నితిన్ నబీన్.. కేంద్ర మంత్రులు.. బిజెపి ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఆర్జెడి తరఫున కూడా భారీగానే ప్రచారం జరిగింది. కానీ జన్ సూరజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ మాత్రమే ప్రచారం చేశారు. బిజెపి.. ఆర్జేడి మధ్య ఓట్ల చీలిక రావడంతో.. అది ప్రశాంత్ కిషోర్ కు అనుకూలంగా మారింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా పై ప్రశాంత్ కిషోర్ 15వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇటీవల కాలంలో జనరేషన్ జెడ్ తరం బిజెపికి వ్యతిరేకంగా ఉంది. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ జరిగిన నాటి నుంచి జనరేషన్ జెడ్ తరం కేంద్ర ప్రభుత్వం మీద ఒక రకంగా యుద్ధాన్ని ప్రకటించింది.

బంకిపూర్ నియోజకవర్గంలో కూడా జనరేషన్ జెడ్ తరం బిజెపికి ఓట్లు వేయలేదు.జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ కు జై కొట్టింది. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రశాంత్ కిషోర్ అద్భుతమైన వ్యూహాన్ని అనుసరించారు. యువకులను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేశారు. అందువల్లే ఉప ఎన్నికల్లో ఆయన గెలవగలిగారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో జన్ సూరజ్ పార్టీ ఖాతా తెరవలేదు. తాజా ఉప ఎన్నికలో గెలిచి జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మొత్తానికి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఎన్నికల ఫలితం బిజెపికి కోలుకోలేని దెబ్బ. మరి దీని నుంచి ఆ పార్టీ ఎలా బయటపడుతుంది.. ప్రజాగ్రహాన్ని ఎలా చల్లార్చుతుంది.. చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper