Homeఎంటర్టైన్మెంట్Irumudi Second Song: తండ్రి - కూతురు ఎమోషన్ కి అద్దం పట్టేలా 'ఇరుముడి' 2...

Irumudi Second Song: తండ్రి – కూతురు ఎమోషన్ కి అద్దం పట్టేలా ‘ఇరుముడి’ 2 వ సాంగ్.. నెటిజెన్స్ ఫిదా..

Irumudi Second Song: మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టి, పూర్తి స్థాయి కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెట్ తో వస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుత ట్రెండ్ కి ఎలాంటి సినిమా చెయ్యాలో , రవితేజ అలాంటి సినిమానే చేస్తున్నాడని , పైగా అయ్యప్ప స్వామి బ్యాక్ గ్రౌండ్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, శివ నిర్వాణ డైరెక్టర్ కావడంతో మార్కెట్ లో ఈ చిత్రం పై విపరీతమైన […]

Irumudi Second Song: మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టి, పూర్తి స్థాయి కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెట్ తో వస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ప్రస్తుత ట్రెండ్ కి ఎలాంటి సినిమా చెయ్యాలో , రవితేజ అలాంటి సినిమానే చేస్తున్నాడని , పైగా అయ్యప్ప స్వామి బ్యాక్ గ్రౌండ్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, శివ నిర్వాణ డైరెక్టర్ కావడంతో మార్కెట్ లో ఈ చిత్రం పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈమధ్య కాలంలో ఏ రవితేజ సినిమాకు కూడా ఆడియన్స్ లో విడుదలకు ముందు ఇంత హైప్ ఏర్పడలేదు. ఇకపోతే ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్ వీడియో , మొదటి పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈ చిత్రం నుండి రెండవ పాట కాసేపటి క్రితమే విడుదలైంది.

‘యాలల్లో యాలల్లో’ అంటూ సాగే ఈ పాటలో రవితేజ కుటుంబాన్ని చూపించాడు డైరెక్టర్. సరదాగా , సాధారణమైన మధ్య తరగతి కుటుంబం లో బంధాలు , అనుబంధాలు ఎలా ఉంటాయో అద్దం పట్టేలా ఈ పాటతో చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా రవితేజ కి తన కూతురు తో రిలేషన్ ని చూస్తుంటే , సినిమాలో ఎమోషనల్ టచ్ పీక్ రేంజ్ లో ఉండేట్టు అనిపిస్తుంది. ఇక జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ట్యూన్ చాలా స్మూత్ గా , వినసొంపుగా ఉంది. అనంత్ శ్రీరామ్ మరోసారి తన సాహిత్యం తో ప్రేక్షకులను కట్టిపారేసాడు. ఇక ఈ పాటలో ప్రియా భవాని శంకర్ చాలా హోమ్లీ గా కనిపించింది. తమిళం లో బాగా పాపులర్ అయినటువంటి ఈ హీరోయిన్ కి , ఇదే మొదటి తెలుగు సినిమా. గతం లో ఈమె అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన ‘దూత’ అనే వెబ్ సిరీస్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది.

ఓవరాల్ గా ఈ పాటని చూస్తుంటే , రవితేజ కి చాలా రిఫ్రెషింగ్ సినిమా లాగా అనిపిస్తోంది. ఈ ఏడాది మొత్తం ఫ్లాప్స్ లో ఉన్న హీరోలందరూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కం బ్యాక్స్ ఇస్తూ , బయ్యర్స్ కి కాసుల కనకవర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు రవితేజ వంతు వచ్చేసిందని అంటున్నారు. ఈ నెల 21 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా రవితేజ కి కం బ్యాక్ మూవీ గా నిలుస్తుందో లేదో చూడాలి. ఆయన కం బ్యాక్ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు , టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper