Akkineni Nagarjuna : తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్ నుండి 8 వ సీజన్ వరకు, ఓటీటీ వెర్షన్ కలిపి మొత్తం ఆరు సీజన్స్ కి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హోస్ట్ గా వ్యవహరించాడు. అన్ని సీజన్స్ లోనూ ఆయన హోస్టింగ్ అదిరిపోయింది కానీ, 8వ సీజన్ కి మాత్రం అతి చెత్తగా చేసాడనే టాక్ భయంకరంగా వెళ్ళింది. 8వ సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ అదిరిపోయారు, ఏ సీజన్ లో కూడా జరగని కాంట్రవర్సీలు ఈ సీజన్ లో జరిగాయి. సున్నితమైన అంశాలు కూడా తెరమీద్దకు వచ్చాయి. నాగార్జున వాటిని సరిగ్గా డీల్ చేసి ఉండుంటే ఈ సీజన్ బ్లాక్ బస్టర్ కా బాప్ అనే రేంజ్ కి వెళ్ళేది. కానీ నాగార్జున సుతిమెత్తని హోస్టింగ్ వల్ల యావరేజ్ రేంజ్ సీజన్ గా మిగిలిపోయింది. చూసే ఆడియన్స్ కి శనివారం ఎపిసోడ్ కి, ఆదివారం ఎపిసోడ్ కి తేడా తెలియకుండా పోయింది.
Also Read : ‘కోర్ట్’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత గ్రాస్ ఎవ్వరూ ఊహించి ఉండరు!
అంతటి చెత్త హోస్టింగ్ చేశాడు నాగార్జున, అందుకే త్వరలో మొదలయ్యే సీజన్ 9 లో అయినా నాగార్జున ని మార్చేసి, దగ్గుబాటి రానా(Daggubati Rana), లేదా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ని తీసుకొని రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇది ఇలా ఉండగా గత సీజన్ లో కంటెస్టెంట్ గా వెళ్లిన సోనియా(Sonia Akula) నాగార్జున హోస్టింగ్ పై ఒక ఇంటర్వ్యూ లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆమె మాట్లాడుతూ ‘ఈ సీజన్ లో నాగార్జున గారి హోస్టింగ్ చాలా చెత్తగా ఉంది. నాకు మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం వస్తే, నాగార్జున గారు ఉంటే అసలు వెళ్ళను. ఆయన ఉంటే చూసే ఆసక్తి కూడా నాకు పోతుంది. ఆయన్ని తీసేసి, రానా దగ్గుబాటి గారిని, లేదా వేరే ఎవరినైనా పెడితేనే ఆ షో బ్రతుకుతుంది. నాగార్జున గారు చాలా సాఫ్ట్ అయిపోయారు, ఒకప్పటి లాగా ఇప్పుడు లేరు, కాబట్టి ఇక ఆయన బిగ్ బాస్ కి సూట్ అవ్వడు’ అంటూ చెప్పుకొచ్చింది.
కేవలం సోనియా అభిప్రాయం మాత్రమే కాదు, ఈ షోని అమితంగా ఇష్టపడే ప్రేక్షకుల అభిప్రాయం కూడా ఇదే. నాగార్జున ని తప్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యం లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ టీం రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ని సంప్రదించింది. చర్చలు అయితే నడుస్తున్నాయి. ఆయన ఈ సీజన్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ చేస్తే మాత్రం టీఆర్ఫీ రేటింగ్స్ బద్దలు అయిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ కి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన బిగ్ బాస్ సీజన్ చేయడం వల్ల వాళ్లంతా ఈ సీజన్ ని చూడడం మొదలు పెడుతారు. విజయ్ దేవరకొండ కి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ పెరుగుతుంది. అందుకే ఆయన కూడా ఈ షో చేసేందుకు సుముఖత చూపించినట్టు తెలుస్తుంది.