Adarsha Kutumbam: త్రివిక్రమ్ శ్రీనివాస్ , విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం , అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈ చిత్రం లో వెంకటేష్ భార్య పాత్ర పోషిస్తున్న శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ టీజర్ ని పరిచయం చేస్తూ మరో టీజర్ ని విడుదల చేశారు. ఇందులో ఆమె స్వర్ణ అనే పాత్ర పోషిస్తుంది. అయితే ప్రతీ పెద్ద సినిమాకు సంబంధించిన టీజర్ లేదా ట్రైలర్ విడుదలైనప్పుడు సోషల్ మీడియా లో ఫన్నీ మీమ్స్ రావడం సహజం, అలా ఈ సినిమా టీజర్ మీద కూడా చాలా ఫన్నీ మీమ్స్ వచ్చాయి.
అందులో ‘పెద్ది’ చిత్రం తో లింక్ చేస్తూ చేసిన ఒక మీమ్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. నిన్న విడుదల చేసిన టీజర్ లోని చివరి షాట్ లో వెంకటేష్ కుటుంబం మొత్తం ట్రైన్ డోర్ వద్ద నిల్చొని చూస్తూ ఉండే షాట్ గుర్తుందా?, ఈ షాట్ కి , ‘పెద్ది’ చిత్రం ప్రీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ ట్రైన్ డోర్ బయట నిల్చొని కాలు బయటపెట్టే సన్నివేశానికి లింక్ చేస్తూ ‘ఆదర్శ కుటుంబం ట్రైన్ నుండి పెద్ది ని చూస్తున్నారు’ అంటూ ఒక మీమ్ క్రియేట్ చేశారు , ఇది బాగా వైరల్ అయ్యింది. కొంతమంది అయితే ‘ఆదర్శ కుటుంబం’ లో పెద్ది అంటూ కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా లో పెద్ది ని లింక్ చేస్తూ చాలా పోస్టులే కనిపిస్తున్నాయి.
మరోపక్క కొంతమంది ‘ఆదర్శ కుటుంబం’ లోని ఈ ట్రైన్ షాట్ ని , పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తో కూడా పోలుస్తున్నారు. ఆ సినిమా టీజర్ కి సంబంధించిన మొదటి టీజర్ చివరి షాట్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఆ షాట్ ని ‘ఆదర్శ కుటుంబం’ లోని షాట్ తో పోలుస్తూ , త్రివిక్రమ్ మార్క్ కనిపించింది , ఫలితాలు కూడా ఒకేలా ఉంటాయా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ‘అజ్ఞాతవాసి’ రిపీట్ అవుతుందా?, లేదా ‘అలా వైకుంఠపురంలో’ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారా అనేది తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.
#RamCharan will return as ‘PEDDI’ in #AK47. pic.twitter.com/X3IXz4i91M
— Telugu Chitraalu (@CineChitraalu) July 27, 2026