Akhil Akkineni: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 12 ఏళ్లకు అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రం తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని నమోదు చేసుకున్నాడు. ఆలస్యంగా హిట్ కొట్టినప్పటికీ, చాలా బలంగానే కొట్టాడు అని చెప్పొచ్చు. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక మధురమైన జ్ఞాపకం. ఇక్కడి నుండి అఖిల్ తన కెరీర్ లో మినిమం గ్యారంటీ డైరెక్టర్స్ తో పని చేస్తూ వెళ్తే మాత్రం , కచ్చితంగా ఆయన స్టార్ హీరో రేంజ్ కి ఎదుగుతాడని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల తర్వాత అక్కినేని అఖిల్ ఇచ్చిన ఒక పోడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ పోడ్ క్యాస్ట్ లో ఆయన ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిన విధానం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ ప్రతీ సినిమా విషయం లోనూ నాగార్జున గారి ప్రమేయం ఉంటుందా?’ అని అడగ్గా , అందుకు అఖిల్ సమాధానం చెప్తూ ‘ఎంత వరకు ఆయన ఇన్వాల్వ్ అవ్వాలో , అంత వరకు అవుతారు. ఒక్క ఏజెంట్ సినిమా స్టోరీ ని మాత్రమే ఆయన వినలేదు. నాకు నేను సొంతంగా ఎంచుకున్న స్టోరీ అది. సినిమా విడుదల ముందు రోజు వరకు కూడా నాన్న గారికి ఏజెంట్ స్టోరీ తెలియదు. ఆ సినిమా ఫలితం పట్ల ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సినిమా ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణాల్లో , ఇతరుల తప్పు ని వెతకడం కంటే ఎక్కువగా , నేనేమి తప్పు చేశానో చూసుకున్నాను. ఈమధ్యనే ఆ చిత్రాన్ని మరోసారి చూసుకున్నప్పుడు నన్ను నేనే ద్వేషించుకున్నాను. అనేక సన్నివేశాల్లో చాలా ఓవర్ యాక్షన్ చేశానని అనిపించింది. అంత ఎనర్జీ పెట్టాల్సిన అవసరం లేకపోయినా , కొన్ని సన్నివేశాలకు ఓవర్ ఎనర్జీ పెట్టాను’ అంటూ చెప్పుకొచ్చారు అఖిల్.
తనలోని లోపాల గురించి ఇంత నిర్మొహమాటంగా చెప్పడం సాధారణమైన విషయం కాదు. అయితే అఖిల్ తనలోని లోపాలని గుర్తించి ‘లెనిన్’ చిత్రం లో సరి చేసుకున్నాడు. సినిమా చూస్తున్నంతసేపు అఖిల్ ఎక్కడా నటించినట్టు అనిపించదు , జీవించినట్టుగా అనిపిస్తుంది. సన్నివేశానికి ఎంత కావాలో అంతే చేసాడు, అంతకు మించి ఓవర్ యాక్షన్ కనిపించదు. అందుకే విమర్శకులు కూడా అఖిల్ నటన పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే తరహా లో ఆయన ముందుకు పోతే మాత్రం కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడని అంటున్నారు నెటిజెన్స్.
View this post on Instagram