Homeఎంటర్టైన్మెంట్Aadarsa Kutumbam Review: 'ఆదర్శ కుటుంబం' మూవీ ఫుల్ రివ్యూ.. అంచనాలను అందుకుందా లేదా?

Aadarsa Kutumbam Review: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫుల్ రివ్యూ.. అంచనాలను అందుకుందా లేదా?

Aadarsa Kutumbam Review: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటేనే ఒక బ్రాండ్. ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుండి యూత్ ఆడియన్స్ వరకు ప్రతీ ఒక్కరు ఆయన సినిమాలను చూసేందుకు ఎగబడుతూ ఉంటారు. హీరో ఎవరు అనేది కూడా పట్టించుకోరు , కేవలం త్రివిక్రమ్ బ్రాండ్ ఒక్కటే బాక్స్ ఆఫీస్ వద్ద పనిచేసేది. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ హిట్ ని అందుకొని మంచి ఊపు మీదున్న వెంకటేష్ తో సినిమా చేస్తే క్రేజ్ […]

Aadarsa Kutumbam Review: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటేనే ఒక బ్రాండ్. ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుండి యూత్ ఆడియన్స్ వరకు ప్రతీ ఒక్కరు ఆయన సినిమాలను చూసేందుకు ఎగబడుతూ ఉంటారు. హీరో ఎవరు అనేది కూడా పట్టించుకోరు , కేవలం త్రివిక్రమ్ బ్రాండ్ ఒక్కటే బాక్స్ ఆఫీస్ వద్ద పనిచేసేది. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ హిట్ ని అందుకొని మంచి ఊపు మీదున్న వెంకటేష్ తో సినిమా చేస్తే క్రేజ్ ఎలా ఉండాలి?, కానీ ఊహించినంత క్రేజ్ ఈ చిత్రానికి ఏర్పడలేదు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రూపాయిల కంటే తక్కువ గ్రాస్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఓవర్సీస్ లో త్రివిక్రమ్ కి ఎలాంటి బ్రాండ్ వేల్యూ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలు అక్కడ సంచలనాలు నమోదు చేశాయి.

అలాంటి ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి కేవలం 1 లక్షా 78 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. త్రివిక్రమ్ బ్రాండ్ కి ఇది చాలా తక్కువని చెప్పొచ్చు. ఈ చిత్రానికి ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడానికి కారణం , ఇదొక రొటీన్ ఫామిలీ ఎంటర్టైనర్ అని ఆడియన్స్ కి అనిపించడం వల్లే. ఈమధ్య కాలం లో ఇలాంటి సినిమాలకు క్రేజ్ బాగా తగ్గిపోయింది. అంతే కాకుండా రెండు మూడు సార్లు వాయిదా పడడం వల్ల ఈ చిత్రం బజ్ బాగా తగ్గిపోయిందని అంటున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నప్పటికీ , పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ వసూళ్లు నమోదు అవుతాయని అంతా అనుకుంటున్నారు. నేడు విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందో లేదో చూద్దాం.

ముందుగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే , ఆరంభం చాలా ఆర్డినరీ గానే ఉంది , కానీ స్టోరీ సెటప్ పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ అయ్యాక , వెంకటేష్ తన ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్ తో ఈ సినిమాని మరో లెవెల్ కి.తీసులెళ్ళాడు. సత్య కామెడీ టైమింగ్, వెంకటేష్ తో అతని కాంబినేషన్ సన్నివేశాలు పొట్ట చెక్కలు అయ్యేలా ఆడియన్స్ ని నవ్విస్తాయి , ఇంటర్వెల్ సన్నివేశం చాలా సాలిడ్ గా ఉంది , సెకండ్ హాఫ్ కి మంచి సెటప్ ని ఏర్పాటు చేసింది. ఓవరాల్ గా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ , వెంకటేష్ హిలేరియస్ కామెడీ టైమింగ్ తో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చిందనే చెప్పాలి.

ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి . చాలా సన్నివేశాలను డ్రాగ్ చేసారు , కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యింది కానీ, కొన్ని చోట్ల చాలా ఆర్టిఫీషియల్ గా ఉంది. ఇక తమన్ సంగీతం కూడా నిరాశపర్చింది. పాటలు పెద్దగా బాగాలేవు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా యావరేజ్ గా ఉంది . వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించే ప్రయత్నం చేసాడు కానీ , సెకండ్ హాఫ్ లో త్రివిక్రమ్ వీక్ ఎగ్జిక్యూషన్ కారణంగా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది . ఓవరాల్ గా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బిలో యావరేజ్ నుండి యావరేజ్ రేంజ్ లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హైప్ ఉండుంటే ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడానికి ఈ మాత్రం సరిపోతుంది , కానీ హైప్ లేకపోవడం వల్ల ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కి ఈ టాక్ సరిపోదని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఈ చిత్రానికి మా ఓకే తెలుగు ఇస్తున్న రివ్యూ 2.5/5 . మీరు ఈ చిత్రాన్ని చూశారా ?, ఒకవేళ చూసి ఉండుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper