spot_img
Homeఎంటర్టైన్మెంట్Love Reddy: థియేటర్ కి వచ్చిన ప్రముఖ నటుడిపై దాడి చేసిన మహిళ..'లవ్ రెడ్డి' థియేటర్...

Love Reddy: థియేటర్ కి వచ్చిన ప్రముఖ నటుడిపై దాడి చేసిన మహిళ..’లవ్ రెడ్డి’ థియేటర్ లో అనూహ్య ఘటన!

Love Reddy: కొంతమంది ప్రేక్షకులు సినిమాలో ఉండే పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోతుంటారు. వాళ్ళు వేసే పాత్రలను చూసి నిజ జీవితంలో కూడా ఇలాగే ఉంటారు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్స్ చేసే నటీనటులకు ఇది చాలా డేంజర్. ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు కోటా శ్రీనివాస రావు ఒకసారి సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్తే ఒక ప్రేక్షకుడు ఎందుకు మా హీరోని అలా హింసిస్తావు అని కొట్టబోయాడట. ఈ విషయాన్నీ స్వయంగా కోటా శ్రీనివాస రావు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అది కేవలం పాత్ర మాత్రమే అని చెప్పినా అక్కడి ప్రేక్షకుల ఆగ్రహాన్ని కంట్రోల్ చేయలేకపోయారట. సరిగ్గా ఇలాంటి సంఘటనే నిన్న హైదరాబాద్ లోని జీపీఆర్ మాల్ లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవలే ‘లవ్ రెడ్డి’ అనే కొత్త సినిమా విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాని ప్రేక్షకుల మధ్యలో కూర్చొని వాళ్ళ నుండి వచ్చే రెస్పాన్స్ ని చూడాలని అనుకుంది మూవీ టీం. సినిమా మొత్తం అయిపోయాక మూవీ టీం స్టేజి మీదకు వచ్చి ఎలా ఉంది సినిమా, ఎంజాయ్ చేసారా అని అడుగుతారు. అప్పుడే ఒక మహిళ ఆ సినిమాలో హీరోయిన్ కి తండ్రి పాత్ర పోషించిన NT రామస్వామి వైపు దూసుకొచ్చింది. అతన్ని కొట్టేందుకు ప్రయత్నం చేసింది. వినడానికి కూడా అసహ్యించుకునే బూతులు మాట్లాడింది. ఆమె రియాక్షన్ చూసి పాపం రామస్వామి పాపం షాక్ కి గురయ్యాడు. మూవీ టీం ఆమెని సముదాయించడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ ఆమె ఆవేశాన్ని ఆపలేకపోయారు. ఆ తర్వాత ఆమెని పక్కకి తీసుకెళ్లి ఇది కేవలం సినిమా మాత్రమే. ఆయన కేవలం పాత్ర మాత్రమే పోషించాడు. ఇదంతా నిజం కాదు అని చెప్పడంతో ఆమె శాంతించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది.

నెటిజెన్స్ ఈ వీడియో ని షేర్ చేసి నవ్వుతున్నారు. అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన కాదని, సినిమాకి పబ్లిసిటీ కోసం కావాలని ఇలా ఆమెకి డబ్బులిచ్చి చేయించారని అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ, ఈ వీడియో మాత్రం వైల్డ్ ఫైర్ లాగా సోషల్ మీడియా మొత్తం వ్యాప్తి చెందింది. ఇక లవ్ రెడ్డి సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం మొత్తం కొత్తవాళ్ళతోనే తెరకెక్కించారు. సమరన్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి హీరో హీరోయిన్లు గా నటించారు. నటీనటులు మూవీ టీం మొత్తం కొత్త వాళ్ళే అయినప్పటికీ, టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకోవడం తో ఈ చిత్రానికి పలు సిటీస్ లో మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. మరి ఇదే రేంజ్ రెస్పాన్స్ మిగిలిన ప్రాంతాలలో కూడా వస్తుందా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper