Prithviraj: Prithvira 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్ ఇటీవల లైలా సినిమా ముందస్తు విడుదల కార్యక్రమానికి సంబంధించి నిర్వహించిన వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిర్వాహకులు ఆయనకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ “150 గొర్రెలు” అంటూ వివాదాస్ పద వ్యాఖ్యలు చేశారు.. అయితే పృథ్వీరాజ్ గతంలో వైసీపీలో ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అవకాశం ఇచ్చారు. వివాదాస్పద ఘటనతో ఒక్కసారిగా పృథ్వీరాజ్ వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆ తర్వాత అతడిని ఆ పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి తొలగించారు. దీంతో పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా పిఠాపురంలో జబర్దస్త్ లో నటించే వారితో పృథ్వీరాజ్ ప్రచారం నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీరాజ్ కు ఏదో ఒక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇంతవరకు అతడికి ఎటువంటి పదవీ దక్కలేదు.. ప్రస్తుతం పృథ్వీరాజ్ కు సినిమా అవకాశాలు భారీగానే వస్తున్నాయి. అయితే అతడు ఇటీవల జరిగిన లైలా సినిమా ముందస్తు విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతూ 150 గొర్రెలు అంటూ వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో వైసిపి శ్రేణుల యుద్ధం
పృథ్వీరాజ్ చేసిన 150 గొర్రెల వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడడం మొదలుపెట్టారు.. సోషల్ మీడియాలో పృథ్వీరాజ్ ను ఏకిపడేశారు. సోమవారం ఏకంగా బ్యాన్ లైలా మూవీ అనే యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. దీంతో లైలా చిత్ర యూనిట్ ఒక్కసారిగా దిగి రావాల్సి వచ్చింది. ఆ చిత్ర హీరో విశ్వక్ సేన్ సారీ చెప్పాల్సి వచ్చింది. చిత్ర నిర్మాత కూడా అనుకోకుండా జరిగిన ఘటన అని.. క్షమించాలని కోరారు.. 150 గొర్రెలు అని వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్ ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. సోషల్ మీడియాలో అయితే ఏకంగా యుద్ధమే ప్రకటించాయి. దీంతో పృథ్వీరాజ్ ఒక్కసారిగా హైబీపీకి గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ” పృథ్వీరాజ్ కు ఒక్కసారిగా బిపి పెరిగింది. బిపి హై రేంజ్ లో ఉండడంతో ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నాం. త్వరలోనే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని” వైద్యులు పేర్కొన్నారు..కాగా, వైసీపీ శ్రేణులు టార్గెట్ చేయడంతోనే పృథ్వీరాజ్ బీపీ పెరిగిందని.. ఆయన ఒత్తిడికి గురయ్యారని.. అందువల్లే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని.. సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అశ్వస్తకు గురైన 30 ఇయర్స్ పృథ్వీ రాజ్
బెదిరింపు కాల్స్, సోషల్ మీడియా ట్రోల్స్ కి మనస్తాపన చెంది హాస్పిటల్ లో జాయిన్ అయ్యి చికిత్స పొందుతున్నారు #Laila #PrudhviRaj #Viswaksen pic.twitter.com/gvz4mIQl6G
— Subhodayam Subbarao (@rajasekharaa) February 11, 2025