Star Comedian: కానీ ఈ స్టార్ కమెడియన్ కొడుకు మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి కాకుండా సరికొత్త దారిని ఎంపిక చేసుకున్నాడు. ఈ నటుడి కొడుకు యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. సాధారణంగా చాలామంది ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడని అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు కూడా పోలీస్ అవుతాడని అంటుంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక నటుడి కొడుకు నటుడు అవుతాడని అందరూ అంటుంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొన్నేళ్ల నుంచి నెపోటిజం అనే వార్తలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్ల వారసులు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఒక నటుడి తనయుడు మాత్రం దీనికి భిన్నం అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఈ నటుడు ఒక స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ నటుడి కొడుకు మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు.
Also Read: ప్రభాస్ సినిమాల మీద క్లారిటీ వచ్చిందా..? సలార్2, కల్కి 2, స్పిరిట్ వీటిలో ఏది ముందు వస్తుంది..?
ఈ స్టార్ కమెడియన్ మరెవరో కాదు తమిళ నటుడు కమెడియన్ చిన్ని జయంత్. జయంతి కుమారుడు AIR lo యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడు. ఇతని తండ్రి సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప నటుడు. స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కూడా ఇతని తండ్రి కలిసి నటించాడు. కానీ కొడుకు మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకుండా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇతని పేరు శృతంజయ్ నారాయణన్. శృతంజయ్ గిండీలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి బ్యాచిలర్ డిగ్రీ మరియు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆటోగ్రఫీనీ 2011 నుంచి 2015 వరకు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇతను అశోక విశ్వవిద్యాలయంలో 2015లో చేరి మాస్టర్స్ డిగ్రీ మరియు లిబరర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ స్టడీస్ ను పూర్తి చేశాడు.
ఆన్లైన్ ప్రసాద్ లో మార్కెటింగ్ ఇంటర్న గా కూడా పని చేసేవాడు. అయమారా ఈవెంట్లను కూడా స్థాపించాడు. ఇతను నాస్కం ఫౌండేషన్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా కూడా పనిచేసేవాడు. 2018లో శృతంజయ్ తన యూపీఎస్సీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. 2019లో రెండోసారి యూపీఎస్సీ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 75 వ ర్యాంకు సాధించాడు. తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు అదనప కలెక్టర్ గా శృతంజయ్ బాధ్యతలు చేపట్టాడు. ఇక ఆయన తండ్రి చిన్ని జయంత్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో అనేక సినిమాలలో కమీడియన్ గా రాణించారు. అలాగే తమిళ సినిమా దర్శకుడిగా కూడా ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.