Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న వారిలో ఒకరు రష్మీ(Rashmi Gautam). జబర్దస్త్ తో ఈమె యాంకర్ కెరీర్ గ్రాండ్ గా మొదలైంది. మధ్యలో ఎన్నో టీవీ షోస్ కి యాంకర్ గా చేసింది, కానీ జబర్దస్త్ ని మాత్రం ఆమె ఇప్పటికీ వదలలేదు, చేస్తూనే ఉంది. ఈ షోతో మొదలైన జడ్జీలు మారిపోయారు, కమెడియన్స్ మారిపోయారు, యాంకర్ అనసూయ కూడా షో ని వదిలి వెళ్ళిపోయింది, కానీ రష్మీ మాత్రం ఇంకా చేస్తూనే ఉంది. ఈ షో తో పాటు ఆమె ఈటీవీ ఛానల్ లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, మధ్యలో కొన్ని పండుగ ఈవెంట్స్ చేస్తూ ఉంటుంది. అయితే రష్మీ కి గతంలో సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు బాగానే వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ఆమెని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
Also Read : నా ప్రేమ నిజమైతే..నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్!
ఇదంతా పక్కన పెడితే ఈ వారం టెలికాస్ట్ అవ్వబోయే ‘జబర్దస్త్'(Jabardasth Show) ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందులో స్కిట్ వేస్తున్న బుల్లెట్ భాస్కర్ పై ఆమె సీరియస్ గా విరుచుకుపడడం అందరినీ షాక్ కి గురి చేసింది. స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ రష్మీ వైపు వంకరగా చూస్తూ ఈలలు వేస్తాడు. అందుకు ఫైర్ అయిన రష్మీ ‘చెప్పు తీసుకొని కొడుతా..ఏమి అనుకుంటున్నావ్? మీ ఇంట్లో అక్కా చెల్లెలు లేరా?’ అని అడుగుతుంది. బుల్లెట్ భాస్కర్(Bullet Bhaskar) కూడా సీరియస్ గానే రియాక్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలోపు ఆయన దానిని పంచ్ గా మార్చేశాడు. ఆయన కౌంటర్ ఇస్తూ ‘మా ఇంట్లో అక్కా చెల్లెలు ఉన్నారు, కానీ వాళ్ళు వదిన లేదు అంటున్నారు..అందుకే’ అని అంటాడు. దీనికి రష్మిక కూడా నవ్వేస్తుంది. కాసేపు ఆమె ముఖం లో ఎక్స్ ప్రెషన్స్ ని చూస్తే నిజంగానే వార్నింగ్ ఇచ్చిందా అన్నట్టుగా అనిపించింది.
అంత సహజంగా నటించింది యాంకర్ రష్మీ. ఈ ప్రోమో వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే రష్మీ అనే పేరు తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే మరోపేరు సుడిగాలి సుధీర్. వీళ్లిద్దరి కాంబినేషన్ బుల్లితెర పై ఒక సెన్సేషన్. కచ్చితంగా వీళ్లిద్దరు ప్రేమికులే, ప్రస్తుతం డేటింగ్ లో ఉంటున్నారని అందరూ బలంగా నమ్ముతుంటారు. కానీ వాళ్ళు మాత్రం మేము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ ఎన్నో సందర్భాల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ, ఎవ్వరూ నమ్మడం లేదు. అయితే సుడిగాలి సుధీర్ ఈటీవీ ని వదిలి వెళ్లిపోవడంతో వీళ్ళ ఆన్ స్క్రీన్ జోడికి పెద్ద బ్రేక్ పడింది. మళ్ళీ వీళ్లిద్దరు బుల్లితెర పై కనిపించి సందడి చేస్తే చూడాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి వాళ్ళ కోరిక నెరవేరేది ఎప్పుడో.
Also Read : చెప్పు తెగుద్ది.. సీనియర్ కమెడియన్ పై రష్మీ ఫైర్!