Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో రోహిత్ ఇంగ్లాండ్ జట్టుపై సూపర్ సెంచరీ తో టచ్ లోకి వచ్చాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అయితే కటక్ వన్డేలో సెంచరీ చేసిన రోహిత్.. మరో 13 పరుగులు చేస్తే దిగ్గజ ఆటగాళ్ల రికార్డులు బద్దలవుతాయి.
సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ చేయడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై అంచనాలు పెరిగిపోయాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు అతడు సెంచరీ చేయడంతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.. రోహిత్ ఇలానే ఆడితే టీమిండియా కచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంటుందని జోస్యాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కటక్ వన్డే లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. పరుగుల దాహంతో ఉన్న అతడు ఇంగ్లాండ్ బౌలర్ల పై ఎదురుదాడికి దిగాడు.. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు.. దీంతో అభిమానులు పూనకాలు ఊగారు.. రోహిత్ రోహిత్ అంటూ నినాదాలు చేశారు.. వారి ఉత్సాహానికి తగ్గట్టుగానే రోహిత్ కూడా ఎక్కడా తగ్గకుండా బ్యాటింగ్ చేశాడు. సూపర్ సెంచరీ(119) మాత్రమే కాదు..గిల్ తో కలిసి తొలి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా ఇంగ్లాండ్ విధించిన 300+ లక్ష్యాన్ని సైతం సులువుగా చేదించేలాగా చేశాడు.
మరో 13 పరుగులు చేస్తే
ఇంగ్లాండ్ జట్టుపై సూపర్ సెంచరీ తో అదరగొట్టిన రోహిత్ శర్మ.. మరో రికార్డుపై కన్నేసాడు.. బుధవారం భారత్ – ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మూడవ వన్డే జరుగుతుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా.. మూడవ వన్డేలో ప్రయోగాలకు దిగే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లకు చోటు కల్పించే అవకాశం ఉంది. మరోవైపు రోహిత్ శర్మ అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడవ వన్డేలో చేస్తే వన్డేలలో అత్యంత వేగంగా 11వేల రంస్ పూర్తి చేసిన రెండవ ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 259 ఇన్నింగ్స్ లలో 10,987 పరుగులు చేశాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ ఉన్నాడు. 222 ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ 11వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. విరాట్ తర్వాత సచిన్ టెండూల్కర్ 276, రికీ పాంటింగ్ 286, గంగూలీ 288, కల్లిస్ 293 ఇన్నింగ్స్ లలో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. కటక్ వన్డేలో సూపర్ సెంచరీ చేసిన రోహిత్.. అహ్మదాబాద్ వన్డేలో 13 పరుగులు చేయడం పెద్ద విషయం కాదు. మరోవైపు రోహిత్ ఫామ్ లోకి రావడంతో ఛాంపియన్స్ ట్రోఫిక్ ముందు.. భారత జట్టులో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్ గిల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుండడంతో.. ఓపెనర్లుగా వీరిద్దరే పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతారని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.