spot_img
Homeఎన్నికలుMLC By Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్‌.. షెడ్యూల్‌ రిలీజ్‌!

MLC By Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్‌.. షెడ్యూల్‌ రిలీజ్‌!

MLC By Election: తెలంగాణలో ఖాళీ అయిన వరంగల్‌ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈమేరకు ఎన్నికల సంఘం గురువారం(ఏప్రిల్‌ 25న) షెడ్యూల్‌ విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన కొన్ని గంటల్లోనే షెడ్యూల్‌ విడుదల కావడం గమనార్హం.

మే 2న నోటిఫికేషన్‌..
వరంగల్‌ – ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించే ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ మే 2న విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. అదే రోజు నుంచి మే 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొంది. మే 10వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది. మే 13 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుందని తెలిపింది.

ఓటరు జాబితా సిద్ధం..
మరోవైపు నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇప్పటికే పట్టభద్రుల ఓటరు నమోదు చేపట్టారు. ఈమేరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఇంటింటికీ తిరిగి విచారణ చేపట్టిన ఓటర్ల తుదిజాబితా రూపొందించారు. జాబితా కూడా విడుదల చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లు ఉన్నారు. గతంతో పోలిస్తే 43,759 మంది ఓటర్లు తగ్గారు. ఓటరు నమోదుకు పట్టభద్రులు నిరాసక్తి చూపారు. మహిళా ఓటర్లు మాత్రం 1,930 మంది పెరిగారు. పురుష ఓటర్లు 45,627 మంది, ఇతరులు 62 మంది తగ్గారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper