MLC Elections : తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల స్థానానికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. మూడు స్థానాల ఓట్ల లెక్కింపును మార్చి 3న(సోమవారం) ప్రారంభించారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి(Sreepal Reddy) విజయం సాధించారు. రెండో ప్రాధన్యత ఓట్ల లెకి‍్కపుతో ఫలితం తేలింది. ఇక కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం కమలం వశమైంది. ముందు నుంచీ అనుకున్నట్లుగా మల్క కొమురయ్య(Malka Komuraiah) ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.తొలిప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం.
రోజంతా వడపోతే..
ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభం కాలేదు. రోజంతా ఓట్ల వడపోతకే సరిపోయింది. పట్టభద్రుల నియోజకవర్గస్థానానికి మొత్తం 2,52,100 ఓట్లు పోలయ్యాయి. మంగళవారం ఉదయం వరకు బ్యాలెట్ పత్రాల(Ballot papers) పడపోతకే సరిపోయింది. మధ్యాహ్ననికి చెట్లుబాటు అయిన ఓట్లు 2,24,000గా ప్రకటించారు. 28 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు. వీటిని ఎన్నికల అధికారి మరోమారు పరిశీలించారు. ఇక మంగళవారం(Tuesday) మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. మొత్త 11 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. ఒక్కొక్క రౌండ్‌కు 21 వేల ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు 21 టేబుల్స్(21 Tabels) ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓటు‍్ల చొపు‍్పన విభజించారు.
Also Read : కేంద్ర మంత్రిపై తెలంగాణ సీఎం సంచలన ఆరోపణలు.. రేవంత్‌రెడ్డి లక్ష్యం ఏంటి?
తొలి రౌండ్‌లో ఇలా..
మధ్నాహ్నం 12 గంటల తరా‍్వత పట్టభద్రుల ఎమ్మెలీ‍్స ఓట్ల లెక్కింపు మొదలైంది. 2:30 గంటలకు తొలి ఫలితం వచ్చింది. మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,712, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 6,676, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,857, స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు 107, మహ‍్మద్ ముస్తాక్ అలీకి 156, యాదగిరి శేఖర్‌రావుకు 500 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి 24 ఓట్ల స్వల్ప మెజారిటీ సాధించారు.
రెండో రౌండ్‌లో..
ఇక 2:30 గంటల నుంచి రెండో రౌండ్ కౌంటింగ్ మొదలు పెట్టారు. సాయంత్రం 4:30 గంటలకు రెండో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 14,690, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 13,198, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 10,746 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్ 1,492కు పెరిగింది.
మూడో రౌండ్‌లో..
ఇక మూడో రౌండ్ లెక్కింపు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు పూర్తయింది. ఈ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 23,307, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 18,812, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,898 ఓట్లు వచ్చాయి ఈ రౌండ్ తర్వాత బీజేపీ ఆధిక్యం 4,4,94కు పెరిగింది.
Also Read : ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలుపెవరిది..?