Nagababu : ఎమ్మెల్సీ ఎన్నికల( MLC elections) సందడి ప్రారంభం అయ్యింది. ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మరో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీకి ఆ నాలుగు స్థానాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నవి నాలుగు పదవులు కానీ.. దాదాపు ఓ 25 మంది పదవులు ఆశిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్
కొద్ది రోజుల కిందట నాగబాబును( Nagababu ) ఏపీ క్యాబినెట్ లోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ముందుగా ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. రెండు రోజుల కిందట నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఆసక్తికరమైన విషయాలను పొందుపరిచారు నాగబాబు. తన ఆస్తులతో పాటు అప్పుల వివరాలను వెల్లడించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. గతంలో ఆయన నరసాపురం ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆఫిడవిట్ లో చాలా అంశాలను పొందుపరిచారు. తాజాగా మరోసారి పొందుపరిచారు.
Also Read : మా అన్నయ్య అబద్దాలు చెప్తున్నాడు..కళ్యాణ్ బాబు ఇంట్లో అలా ఉండేవాడు అంటూ నాగబాబు షాకింగ్ కామెంట్స్!
* చరాస్తులు.. నాగబాబుకు( Nagababu) చరాస్తులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్/ బాండ్ల రూపంలో రూ. 55.37 కోట్లు, చేతిలో నగదు రూ.21.81 లక్షలు, బ్యాంకులో నిల్వ రూ.23.53 లక్షలు, ఇతరులకి ఇచ్చిన అప్పులు రూ.1.03 కోట్లు, రూ.67.28 లక్షలు విలువ చేసే బెంజ్ కార్, రూ. 18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం తన వద్ద, రూ.16.50 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు, రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, రూ.21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు, తన భార్యకు కలిపి చరాస్తులు మొత్తం రూ.59.12 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు.
* స్థిరాస్తులు..
స్థిరాస్తులకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో( Ranga Reddy district ) రెండు వేరువేరు చోట్ల 2.39 ఎకరాల భూమి ఉంది. వీటి విలువ అక్షరాల రూ.3.55 కోట్లు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో రూ.32.80 లక్షల విలువైన 3.28 ఎకరాలు, అదే ప్రాంతంలో మరో సర్వే నెంబర్ తో 50 లక్షల విలువైన ఐదు ఎకరాలు, రంగారెడ్డి జిల్లా టేకులపల్లి లో 53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల భూములు ఉన్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాదులోని మణికొండలో రూ.2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తంగా రూ.11.20 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
* అప్పులు ఇవే..
అప్పులకు సంబంధించి రెండు బ్యాంకులు గృహ రుణ( housing loan) మొత్తం రూ.56.97 లక్షలు, కారు రుణం రూ. 7,54,895 ఇవి కాకుండా ఇతర వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్నవి కలిపి రూ. 1.64 కోట్లు అప్పులు ఉన్నట్లు తెలిపారు. తన అన్న చిరంజీవి నుంచి సుమారు 28 లక్షల 50 వేల రూపాయలు, పవన్ కళ్యాణ్ నుంచి సుమారు 7 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు అఫీడవిట్లో పొందుపరిచారు.
Also Read : నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!