Graduate MLC Results : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC \) ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ మరింత పెరుగుతోంది. బుధవారం(మార్చి 5న) తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో 2,52,029 ఓట్లు పోలవగా, 2,23,343 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 28,686 ఓట్లు చెల్లలేదు. ఈ ఎన్నికల్లో 1,11,672 ఓట్లు వచ్చినవారు విజేతలు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అంజిరెడ్డికి 75,675 ఓట్లు, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్)కి 70,565 ఓట్లు, ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ)కు: 60,419 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్య ఓట్లలో అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నప్పటికీ, కోటా ఓట్లకు 36,000 కంటే ఎక్కువ ఓట్ల దూరంలో ఉన్నారు. దీంతో ఫలితం నేరుగా తేలలేదు.
Also Read: పేరుకే గ్రాడ్యుయేట్లు.. ఓటు వేయడం కూడా రాలేదు.. వైఫల్యంలో ఈసీ పాత్ర కూడా..
తర్వాత ఏం జరుగుతుంది?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతను నిర్ధారించేందుకు ఎలిమినేషన్(Elemination) పద్ధతి అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో తొలి ఎలిమినేషన్: మూడో స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణ (60,419 ఓట్లు) ఎలిమినేట్ అవుతారు. ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 23 మందిని ఎలిమినేట్ చేశారు. చాలిక చంద్రశేఖర్, గుయ్య సాయి కృష్ణమూర్తి, బాలాజీ బక్వాడ్ , నిమ్మ తోట వెంకటేశ్వర్లు , తీటి సుధాకర్ రావు, వేముల విక్రం రెడ్డి, కొమ్ముల నగేష్, అక్కినపల్లి కరుణాకర్, కర్ర జగన్, బండి శ్రీనివాస్, దేవిదాస్ పులగం, కస్బా శంకర్రావు, మల్లేష్ యాసర్ల, శనిగరపు రమేష్ బాబు, ఎన్ శ్రీనివాస్, దయ్యాల ఓం ప్రకాష్, పిడిశెట్టి రాజు, బొల్లి, సుభాష్, మాచ శ్రీనివాస్, రాథోడ్ రవీందర్ నాయక్, సిలివేరి శ్రీకాంత్ , అబ్బగాని అశోక్ గౌడ్, దొడ్ల వెంకట్‌ను ఎలిమినేట్ చేశారు. మొత్త 56 మంది బరిలో ఉండగా 53 మందిని ఎలిమినేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అప్పటికీ ఫలితం తేలకపోతే మూడోస్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణకు పడిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు మిగిలిన ఇద్దరు అభ్యర్థులైన అంజిరెడ్డి, నరేందర్ రెడ్డికి బదిలీ అవుతాయి. ఈ ఓట్లను లెక్కించిన తర్వాత, ఎవరైనా కోటా ఓట్లు (1,11,672) దాటితే వారు విజేతగా ప్రకటించబడతారు.
కీలక అంశాలు:
అంజిరెడ్డి ఆధిక్యం: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ అభ్యర్థికి బలమైన మద్దతు లభించింది. ఇది ఆయనను టాప్‌లో నిలబెట్టింది.
నరేందర్ రెడ్డి పోటీ: కాంగ్రెస్ అభ్యర్థి 5,110 ఓట్ల తేడాతో రెండో స్థానంలో ఉన్నారు. రెండో ప్రాధాన్య ఓట్లలో ఎక్కువ ఓట్లు వస్తే ఆయన ఆధిక్యంలోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రసన్న హరికృష్ణ పాత్ర: బీఎస్పీ అభ్యర్థి ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన ఓట్లు ఎవరికి ఎక్కువగా బదిలీ అవుతాయనేది ఫలితాన్ని నిర్ణయిస్తుంది.
టెన్షన్ కొనసాగుతోంది:
ఈ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ముందంజలోకి రావడం, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు వెనుకబడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు టెన్షన్ తప్పేలా లేదు!
Also Read : గుడ్ న్యూస్: ఈ డివైజ్ తో వాహనం ఎక్కడున్నా తెలిసిపోతుంది..