spot_img
Homeఎడ్యుకేషన్డిగ్రీతో నెలకు రూ.16,000 స్టైఫండ్.. ఎలా పొందవచ్చంటే..?

డిగ్రీతో నెలకు రూ.16,000 స్టైఫండ్.. ఎలా పొందవచ్చంటే..?

sbi youth for india fellowship 2021 apply online

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లకు ఏకంగా 16,000 రూపాయలు స్టైఫండ్ అందిస్తోంది. ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌ ప్రోగ్రామ్ ను ఎన్జీవోల సహాయంతో నిర్వహిస్తోంది. https://youthforindia.org/ వెబ్ సైట్ ద్వారా స్టైఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ స్టైఫండ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరైతే స్టైఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ను కలిగి ఉండటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందుల గురించి అవగాహనను కలిగి ఉండాలి. 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్టైఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 100కు పైగా ఫెలోషిప్ ఖాళీలు ఉండగా ఫెలోషిప్‌ వ్యవధి 13 నెలలుగా ఉంటుంది.

ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌, పర్సనాలిటీ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ స్టైఫండ్ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.sbi.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా 2021 సంవత్సరం ఏప్రిల్ 30 ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకున్న 16,000 రూపాయల స్టైఫండ్ తో పాటు అలవెన్సుల కింద 50,000 రూపాయలు లభిస్తుంది. ఈ ఫెలోషిప్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper