SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు రికరింగ్ డిపాజిట్ ద్వారా ఈ పథకంలో గరిష్ట వడ్డీ రేట్లు అందిస్తుంది. ఈ పథకంలో ప్రతి ఒక్కరు కేవలం 100 రూపాయల నుంచి జమ చేసుకోవచ్చు. అయితే ప్రతి నెల 100, 500, 1000 చప్పున మీరు ఈ పథకంలో జమ చేసినట్లయితే ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోజువారి కూలీలుగా చేసే వాళ్ళు రోజంతా కష్టపడి తమ కుటుంబాన్ని పోషిస్తారు. ఈ విధంగా రోజు వారి కష్టపడేవారు పెట్టుబడి పెట్టడం అనేది వారికి సాధ్యం కానీ పని అని చెప్పొచ్చు. రోజువారి సంపాదించేవారు తమకు వచ్చిన సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేస్తారు.
ఇటువంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందేలాగా ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలు ప్రతినెల చిన్న మొత్తంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టే విధంగా ఎస్బిఐ అవకాశం కల్పిస్తుంది. పొదుపు ఖాతా తో పోలిస్తే ఈ పథకంలో ఎస్బిఐ అధిక వడ్డీ రేటు ఇస్తుంది. ఈ పథకం పేరు ఎస్బిఐ రికరింగ్ డిపాజిట్ పథకం. ఈ రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు ప్రతి నెల చిన్న మొత్తంలో పొదుపు చేసుకోవచ్చు. తమ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ పథకం మీకు బాగా సహాయపడుతుంది. ఇక ఈ పథకంలో 12 నెలలు కనిష్ట టెన్యూర్ అలాగే 120 నెలలు అంటే ఐదు సంవత్సరాలు గరిష్ట టెన్యూర్ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బ్యాంకులలో ఈ పథకం మీకు అందుబాటులో ఉంది. కనీసం గా ప్రతినెలా ఈ పథకంలో మీరు 100 రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. గరిష్టంగా మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు.
Also Read : ప్రతినెల SBI,HDFC,ICICI లో రూ.10వేలు జమ చేస్తే కేవలం 18 నెలల్లో ఎంత వస్తుందో తెలుసా…
కానీ ఈ పథకంలో గడువులోపు డిపాజిట్ మీరు చేయలేకపోతే కొంత పెనాల్టీ పడుతుంది. ఒకవేళ వరుసగా ఆరు నెలలు మీరు ఈ పథకంలో ఎటువంటి డిపాజిట్ చేయకపోతే ఆ ఖాతా క్లోజ్ అవుతుంది. ఆ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ని ఆ ఖాతాదారుడికి చెల్లిస్తారు. ఒక వ్యక్తి ఈ పథకంలో ప్రతినెల 100 రూపాయలు లేదా 500 లేదా వెయ్యి రూపాయలు చొప్పున డిపాజిట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ పథకంలో ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ టెన్యూర్ ఆప్షన్ తీసుకున్నట్లయితే సదరు వడ్డీ రేటు 6.50 శాతం ఉంటుంది. ఐదు సంవత్సరాల తర్వాత నెలకు వంద రూపాయలు జమ చేయడం వలన ఆ వ్యక్తికి 6000 రూపాయలు అవుతుంది. ఇక దానిపై వడ్డీ కలిపితే మీకు చివరికి రూ.7,106 అందుతుంది.