SBI : మన దేశంలో ఉన్న అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనదేశంలో చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకు ఈ బ్యాంకు అంటే నమ్మకం ఉంటుంది. మన దేశంలో ఉన్న ఎక్కువ జనాభా స్టేట్ బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేసి ఉంటారు. చాలా ఏళ్ల నుంచి నమ్మకమైన సేవలను ప్రజలకు అందిస్తుంది ఎస్బిఐ. ఇప్పటివరకు ఎన్నో ప్రైవేటు కంపెనీలు దివాళ్ళ తీసినప్పటికీ కూడా ఎస్బిఐ తన లాభాలతో ప్రభుత్వానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్లో కూడా ఎస్బిఐ షేర్లకు బాగా డిమాండ్ ఉంది. తమ బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సేవలను అందించి వాళ్ల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే పనిలో ఎస్బిఐ ఉంది.
Also Read : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పనులు మాత్రం పొరపాటున కూడా చేయకండి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకు కస్టమర్లకు యూపీఐ ద్వారా ఎవరికి కూడా అంతరాయం రాకుండా చూసేందుకు కృషి చేస్తుంది. ఈ క్రమంలో భాగంగా తాజాగా ఎస్బిఐ టెక్నికల్ అప్డేట్ చేసే పనిలో ఉంది. దీంతో ఈ బ్యాంకు వినియోగదారులకు యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయే అవకాశం ఉంది. అలాగే యూపీఐ సర్వీస్ డౌన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో సర్వర్ కూడా డౌన్ అవుతుంది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుగానే తమ బ్యాంకు కస్టమర్లకు యూపీఐ చెల్లింపులు చేసే వారికి అలర్ట్ జారీ చేసింది. ఎస్బిఐ కొత్త అప్డేట్ చేయడానికి యూపీఐ కస్టమర్లకు తాత్కాలికంగా మాత్రమే సేవలను నిలిపివేయనుంది. ఈ విషయాన్ని ఎస్బిఐ స్వయంగా తన అధికారిక X ఖాతా నుంచి ప్రకటించింది. మే 7వ తేదీ, 2025న మధ్యాహ్నం 12:15 నుంచి ఉదయం 1:00 వరకు ఎస్బిఐ యూపీఐ సేవలు ఉండవని తెలిపింది.
ఈ క్రమంలో తమ కష్టమర్లు ముందుగానే డబ్బులను విత్ డ్రా చేసుకోవాల్సిందిగా ఎస్బిఐ సూచించింది. లేకపోతే ముందుగానే యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసి ఈ సమస్యను వాళ్లు అధిగమించుకోవచ్చు అని తెలిపింది. ఎస్బిఐ అప్డేట్ చేస్తున్న సమయంలో యూపీఐ లావాదేవీలు సాధ్యం కాదు కాబట్టి బ్యాంకు కస్టమర్లు యూపీఐ లైట్ ఉపయోగించి సులభంగా పేమెంట్స్ చేసుకోవచ్చు అని తెలిపింది. తమ బ్యాంకు ఖాతాదారులకు ఏ సమస్య కూడా రాకుండా ఉండేందుకు ఎస్బిఐ ముందస్తుగా ఈ సమాచారాన్ని అధికారికంగా ప్రకటించింది. బ్యాంకులలో లావాదేవీలు యధావిధిగా జరుగుతాయని తెలిపింది. ఈ క్రమంలో బ్యాంకులకు వెళ్లే వారికి ఎటువంటి సమస్యలు తలెత్తవు అని తెలుస్తుంది.