SBI Scheme : అందులో ఒకటి హర్ ఘర్ లక్పతి ఆర్ డి మరొకటి ఎస్బిఐ పేట్రన్స్ స్కీమ్. మీరు చేసే డిపాజిట్ ద్వారా హర్ ఘర్ లక్పతి పథకం కింద లక్షాధికారులు అవ్వచ్చు. సామాన్య ప్రజలలో పొదుపును ప్రోత్సహించేందుకు అలాగే డిపాజిట్లను పెంచేందుకు ఎస్బిఐ రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. హర్ ఘర్ లక్పతి రికరింగ్ డిపాజిట్ అలాగే ఎస్బిఐ పేట్రన్స్ అనే పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలులోకి తెచ్చింది. హర్ ఘర్ లక్పతి పథకం ద్వారా మీరు నిర్దిష్ట కాలవ్యవధిలో లక్ష రూపాయల కంటే ఎక్కువ నగదును సమకూర్చుకోవచ్చు.
Also Read : అప్పులు తీర్చే సులువైన మార్గాలు ఇవే..
బ్యాంకులలో ఉండే సాధారణ ఆర్డి లాగా కాకుండా ఎంత మొత్తంలో మీకు కావాలో దానిని బట్టి మీరు ప్రతి నెల ఎంత చెల్లించాలో ఆధారపడి ఉంటుంది. దీని కనీస కాలవ్యవధి 12 నెలల నుంచి గరిష్టంగా 120 నెలల వరకు ఉంటుంది. మీరు సాధారణంగా ఆర్డీలో ప్రతినెలా కొంత నిర్ణీత నగదు జమ చేస్తారు. కానీ ఎస్బిఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకంలో మీరు వడ్డీ రేటులను బట్టి లక్ష రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతినెలా ఎంత చెల్లించాలో ముందే లెక్కించడం జరుగుతుంది. సాధారణ ప్రజలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 3 నుంచి 4 ఏళ్ల కాల వ్యవధి ఉన్న రికరింగ్ డిపాజిట్ లపై 6.75 శాతం గరిష్ట వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకంలో ఇతర కాలవ్యవధులపై 6.50 శాతం వడ్డీ రేటు ఉంది. అలాగే సీనియర్ సిటిజనులకు 7.25% ఈ పథకంలో ఉంది.
ఇక వేరే పథకాలలో సీనియర్ సిటిజన్స్ కు 7% వడ్డీ రేటు ఎస్బిఐ అందిస్తుంది. సీనియర్ సిటిజెన్లతో పాటు సాధారణ ప్రజలు కూడా లక్ష రూపాయలు పొందడానికి నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో ఎన్ని ఏళ్ళు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ప్రతినెల రూ.2,500 పెట్టుబడి పెట్టడంతో మీకు 6.75% వడ్డీ రేటు తో మెచ్యూరిటీ సమయానికి మూడు ఏళ్లకు లక్ష రూపాయలు అందుతాయి. ఒకవేళ మీరు ప్రతి నెల రు.1810 పెట్టుబడి పెట్టినట్లయితే మీకు 6.75 శాతం వడ్డీ రేటు తో నాలుగు ఏళ్ల మెచ్యూరిటీ సమయానికి లక్ష రూపాయలు అందుతాయి. ఇక ప్రతి నెల మీరు రూ.1407 పెట్టినట్లయితే మీకు 6.50% వడ్డీ రేటు తో ఐదేళ్ల మెచ్యూరిటీ సమయానికి లక్ష రూపాయలు వస్తాయి.