SBI New Rules: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తమ బ్యాంకు కస్టమర్లు వేగంగా క్లైమ్ సెటిల్మెంట్ చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై పొదుపు ఖాతా మరియు ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆన్లైన్లో కూడా క్లైమ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ మీరు కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్పనిసరిగా బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు తప్పనిసరిగా డెత్ క్లెయిమ్స్ కొత్త నియమాలను తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అనేక బ్యాంకులు తమ కస్టమర్లకు డిజిటల్ సేవలు అందించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బ్యాంకులకు సంబంధించిన అన్ని రకాల సర్వీసులను కూడా కస్టమర్లకు ఆన్లైన్లోనే అందిస్తున్నాయి. ప్రస్తుతం డెత్ క్లైమ్ కు సంబంధించిన సేవలను కూడా బ్యాంకులో ఆన్లైన్ ద్వారానే మొదలుపెట్టాయి. నామినీలకు లేదా చట్టబద్ధమైన వారసులకు ఒక బ్యాంకు ఖాతాదారుడు మరణించిన సమయంలో అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులను లేదా ఫిక్స్ డిపాజిట్ లను అందుకునేందుకు సులభం అవుతుంది. ఈ క్రమంలో తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.
ఇప్పటివరకు ఒక ఖాతాదారుడు మరణించిన తర్వాత అతని ఖాతాలో ఉన్న డబ్బులను తీసుకోవడానికి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి డబ్బులు క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చేది. అలాగే ఒక ఖాతాదారుడు మరణించిన తర్వాత అతని సేఫ్ డిపాజిట్ లాకర్లు, లోన్ ఖాతాలకు సంబంధించిన వాటిని పొందేందుకు నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు కచ్చితంగా ఎస్బిఐ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఆ బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారుడు మరణించినప్పుడు అతని సేఫ్ కస్టడీ ఆర్టికల్స్, సేఫ్ డిపాజిట్ లాకర్లు అన్నీ కూడా పొందడానికి డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేయాలి. రుణాల కోసం బ్యాంకులకు సంబంధించిన నిర్దిష్ట తాత్కాలిక హక్కు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇది అన్ని రుణాలకు వర్తిస్తుంది.
ఒక ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆ వ్యక్తి ఖాతాలకు సంబంధించిన క్లైమ్ పరిష్కారానికి హోం బ్రాంచ్ ను మాత్రమే సందర్శించాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మీరు ముందుగా మీకు సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లాలి. ఒక వ్యక్తి డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం మీరు డెత్ సర్టిఫికెట్ తోపాటు నామిని వివరాలు లేదా చట్టపరమైన వారసుడి వివరాల డాక్యుమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని వాళ్లు పరిశీలించిన తర్వాత ఆ ఖాతాదారుడి హోమ్ బ్రాంచ్ కు పంపిస్తారు.