spot_img
Homeఎడ్యుకేషన్Army Recruitment: యువతకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు.. త్వరపడండి

Army Recruitment: యువతకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు.. త్వరపడండి

Army Recruitment: ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే తెలంగాణ యువతకు ఇదొక సువర్ణావకాశం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని జీఎం బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని ఇండియన్ ఆర్మీ నిర్వహించనుంది. డిసెంబర్ 8వ తేదీ నుంచి 16 తేదీ వరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి కేవలం పదో తరగతి ఉత్తీర్ణత అయిన తెలంగాణకి చెందిన యువత మాత్రమే అర్హులు. మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ అగ్నివీర్‌లో చేరడానికి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జోగుళాంబ గద్వాల్, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మంచిర్యాల, మహబూబాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల అభ్యర్థులు పాల్గొనవచ్చు.

ఇండియన్ ఆర్మీ నిర్వహించే ఈ అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ టెక్నికల్, స్టోర్ కీపర్ వంటి ఉద్యోగాలకు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అదే అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు అయితే 8వ తరగతి అర్హత ఉండాలి. అలాగే ఫిబ్రవరి 12న విడుదలైన ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మహిళా మిలిటరీ పోలీస్ పోస్టులకు అభ్యర్థులు హాజరవ్వచ్చు. వీరు ర్యాలీ జరిగే ప్రదేశానికి అన్ని డాక్యుమెంట్లు వివరాలను తీసుకురావాలని బోర్డు తెలిపింది. నోటిఫికేషన్‌లో ఏ విధంగా వివరాలు ఉన్నాయో వాటిన్నింటిని తీసుకురావాలని సూచించింది. ఈ నియామకాలు పారదర్శంగా ఉంటాయి. వారి అర్హతలు, టాలెంట్ బట్టి ఇస్తారు. అంతే కాని ఎవరైనా ఉద్యోగం ఇస్తామని అంటే డబ్బులు కట్టి మోసపోవద్దని తెలిపారు. ఫేక్ మేసెజ్‌లు, యాడ్‌లకు అసలు నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అగ్నివీర్ ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు సందేహాలు ఏవైనా ఉంటే మాత్రం రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఫోన్ నంబర్‌కి కాల్ చేసి సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు. సందేహలను క్లియర్ చేసుకోవడానకి 040-27740059, 27740205కి చేయవచ్చు.

వీటితో పాటు IOCL చెన్నైలో 240 అప్రెంటీస్‌ల పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవడానికి నవంబర్ 29 చివరి తేదీ. అలాగే నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉన్న 188 పోస్టులకు నవంబర్ 30వ తేదీ లాస్ట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న 253 పోస్టులకు డిసెంబర్ 3వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. రైల్వే గువాహతి 5647 అప్రెంటీస్‌లకు డిసెంబర్ 3వ తేదీ చివరితేదీ. సీడాక్‌లో ఉన్న 98 పోస్టులకు డిసెంబర్ 5వ తేదీ, సీఈఆర్‌ఐలో ఉన్న 37 పోస్టులకు డిసెంబర్ 6వ తేదీ, సీఆర్‌పీఎఫ్‌లో ఉన్న 124 పోస్టులకు డిసెంబర్ 7వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. బీఈఎల్‌లో ఉ్న 229 పోస్టులకు డిసెంబర్ 10వ తేదీ, ఐఐటీ హైదరాబాద్‌లో 31 పోస్టులకు డిసెంబర్ 10వ తేదీ, గెయిల్‌లో ఉన్న 261 పోస్టులకు డిసెంబర్ 11వ తేదీ, ఎస్‌బీఐ‌లో ఉన్న 169 పోస్టులకు డిసెంబర్ 12వ తేదీ, ఐటీబీపీలో ఉన్న 526 పోస్టులకు డిసెంబర్ 14వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper