Love Cheating In Khammam: వయసులో ఉన్నప్పుడు ప్రేమ సహజం. అది ఇద్దరి అవివాహితుల మధ్య జరిగితేనే దానిని ప్రేమ అంటారు. ఇద్దరు ఆడమగలో ఎవరికి వివాహం జరిగినా.. దాని ప్రేమ అని మాత్రం అస్సలు అనరు. ఈ విషయం ఆమెకు అర్థమయ్యేలోపే జీవితం కడతేరిపోయింది. ఈ విషాదం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ కి ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్!
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డలో నరేష్, రమ్య అనే యువతీ యువకులు ఉండేవారు.. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. ఈ నేపథ్యంలో వారిద్దరూ వారి వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పట్లో రమ్యకు మైనార్టీ ఉండడంతో.. నచ్చచెప్పి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నరేష్ కు మరో యువతి తో పెళ్లి జరిపించారు. రమ్య కూడా చదువు మానేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది. అక్కడ ఓ మెడికల్ షాప్ లో పనిచేస్తోంది. నరేష్ కూడా తన భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల రాఖీ పౌర్ణమి నేపథ్యంలో రమ్య ఎర్రగడ్డ వచ్చింది. . నరేష్ కూడా ఇంటికి వచ్చాడు. నరేష్ తనకు పెళ్లి అయినప్పటికీ హైదరాబాదులో రమ్యతో వ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వారిద్దరు రాఖీ పౌర్ణమికి వచ్చిన తర్వాత.. మీ అక్క ఇద్దరూ విశాఖపట్నం వెళ్లారు. అక్కడ వివాహం చేసుకున్నారు. ఓ గదిని అద్దెకి తీసుకొని అందులో ఉండడం మొదలుపెట్టారు . నరేష్ కనిపించకపోవడంతో ఆయన తండ్రి బొందయ్య తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు నరేష్ కి ఫోన్ చేసి ఎర్రగడ్డ రావాలని కోరగా.. అతడు ఉన్నట్టుండి సొంత ఊరికి బయలుదేరాడు. వైజాగ్ లో ఉన్న రమ్యకు ఈ విషయం చెప్పలేదు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా నరేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించింది. ఇంటికి వెళ్లే ముఖం లేక ఆత్మ న్యూనతకు గురైంది. ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. రమ్య తండ్రి విశాఖపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరేష్, రమ్యది ఒకే గ్రామం కావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు..
మొదట్లో నరేష్ తో వెళ్లిపోయినప్పుడు రమ్యకు మైనారిటీ తీరలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తరచూ కలుసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే నరేష్ మనసు మారింది. రమ్య పై ఆశ పుట్టింది. రమ్య కూడా అతడికి పెళ్లయిన విషయాన్ని పట్టించుకోకుండా.. నరేష్ ను తన జీవిత భాగస్వామిగా ఊహించుకుంది. కానీ ఇక్కడే ఆమె పొరపాటు చేసింది. తనను నమ్మి వచ్చిన అమ్మాయికి న్యాయం చేయకపోగా.. వదిలి వెళ్లిపోయి తీవ్ర ద్రోహం చేసాడు. జీవితంలో మోసపోయానని భావించిన రమ్య.. తనకు తాను ఎండ్ కార్డు వేసుకుంది.. అంతేకాదు తను రాసిన లేఖలో నరేష్ ను అసలు వదిలిపెట్టకూడదని.. అతడి తండ్రిని కోరింది..