Homeఎంటర్టైన్మెంట్Toxic First Review: టాక్సిక్ మూవీ ఫస్ట్ రివ్యూ...మూవీ ఎలా ఉందంటే...

Toxic First Review: టాక్సిక్ మూవీ ఫస్ట్ రివ్యూ…మూవీ ఎలా ఉందంటే…

Toxic First Review: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా చేస్తున్న టాక్సిక్ సినిమా ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రివ్యూ షో ని కొంతమంది సినిమా పెద్దలకైతే వేశారు. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఉండడం విశేషం… సినిమాను చూసిన వాళ్ళు చెప్పే రివ్యూ ని బట్టి చూస్తే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా […]

Toxic First Review: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా చేస్తున్న టాక్సిక్ సినిమా ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రివ్యూ షో ని కొంతమంది సినిమా పెద్దలకైతే వేశారు. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఉండడం విశేషం… సినిమాను చూసిన వాళ్ళు చెప్పే రివ్యూ ని బట్టి చూస్తే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా కూడా యశ్ ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇంతకు ముందు వచ్చిన కేజిఎఫ్ సిరీస్ తో మంచి విజయాన్ని సాధించిన ఆయన ఆ తర్వాత ఏ సినిమాలు చేయకుండా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ మూవీ మీదనే తన పూర్తి ఎఫర్ట్స్ ని పెట్టాడు. దాంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఏర్పడ్డాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ కి వస్తున్న పాజిటివ్ టాక్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మొత్తానికైతే యశ్ ఈ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి నటనను కనబరిచినట్టుగా తెలుస్తుంది. ఇందులో యశ్ పాజిటివ్, నెగిటివ్ రెండు క్యారెక్టర్లలో కనిపించబోతున్నాడు. కాబట్టి ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మేకర్స్ చాలా అద్భుతమైన విజువల్స్ తో సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. మూవీ
చూస్తున్నంత సేపు ఒక హాలీవుడ్ సినిమాను చూస్తున్న ఫీల్ అయితే కలుగుతుందని ఈ మూవీని చూసిన సినిమా పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…

ఇక ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ఎలాంటి స్పందనను రాబడుతుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి ఫిదా అవుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే ఇండియాలో మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమాలో యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper