Pushpa-2 stampede victims family: గత ఏడాడి డిసెంబర్ నెలలో లక్షలాది మంది ప్రజల హృదయాలను కలిచివేసింది ఘటన హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సమయం లో హీరో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) రావడం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళా మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్(Sritej) చావు తో పోరాడి ఈమధ్యనే కోలుకున్నాడు. ప్రస్తుతం ఆయన్ని రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉంచారు. శ్రీతేజ్ కి అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేయడమే కాకుండా, ఎప్పటికప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిసితి ని ఆరా తీస్తున్నాడు. అతని తండ్రికి సినీ ఇండస్ట్రీ లో ఉద్యోగ అవకాశం కూడా కల్పించాడు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు కూడా శ్రీతేజ్ కి సహాయం అందించారు. ఇకపోతే శ్రీతేజ్ కి మరో వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘మిషన్ వాత్సల్య పథకం’ ద్వారా శ్రీతేజ్ కి 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నెలకు 4 వేల రూపాయిలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గత మూడు నెలల నుండి ఈ పథకాన్ని ప్రారంభించారు. మూడు నెలల్లో 12 వేల రూపాయిలు శ్రీతేజ్ ఖాతాలో జమ అయ్యింది. ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం పట్ల సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి సీఎం రేవంత్ పై ప్రశంసలు వర్షం కురుస్తున్నాయి. ఇలా తెలంగాణ లో ఎంత మంది అనాధ పిల్లలు ఉంటే, వాళ్ళందిరికీ ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. ఇక శ్రీ తేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే ఆయన కోలుకున్నాడు కానీ, పూర్తి స్థాయిలో మాత్రం కాదు. ఇంకా మనుషులను గుర్తించలేకపోతున్నాడట. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఈ సమస్య నుండి సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.