Cockroach Cafe: నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో బొద్దింకల పేరుతో ఓ పార్టీని ఏర్పాటుచేశారు. అంతేకాదు, ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన కూడా నిర్వహించారు. ఆ ఆందోళన రోజులతరబడి సాగింది. విద్యార్థులు, కాక్రోచ్ జనతాపార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈనేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల నేపథ్యంలో సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమాన్ని క్యాష్ చేసుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బిహార్ రాష్ట్రం నలంద జిల్లా హిల్సా బైపాస్ రోడ్ లో కాక్రోచ్ కేఫ్ పేరుతో ఓ హోటల్ ఏర్పాటు చేశారు. జన్ జడ్ ఉద్యమం నేపథ్యంలో ఇక్కడ హోటల్ ఏర్పాటు చేశారు. యువతను ఆకట్టుకోవడానికి తన హోటల్ కు ఈ పేరు పెట్టానని చెబుతున్నాడు. పేరులో కాక్రోచ్ ఉన్నప్పటికీ.. ఇందులో అత్యాధునిక ఇంటీరియర్స్ ఏర్పాటు చేశాడు. లోపల.. బయట ఆహ్లాదకరమైన వాతావరణం రూపొందించాడు.
ఈ హోటల్ పేరు బొద్దింక అయినప్పటికీ.. శుభ్రత విషయంలో.. యజమాని ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. అంతేకాదు హోటల్లో ఒక్క కాక్రోచ్ కనిపించినా.. కాస్త అశుభ్రత ఉన్నట్టు అనిపించినా.. వాటిని చూపించిన వాళ్లకు ఆరోజు మొత్తం టీ, స్నాక్స్ ఉచితంగా అందిస్తామని ఆయన చెబుతున్నాడు.. అయితే ఈ కాక్రోచ్ పేరు పెట్టిన నేపథ్యంలో చాలామంది యువత ఆ హోటల్ కు వస్తున్నారు. రుచి కూడా బాగుండడంతో ఆ హోటల్ పేరు మారు మోగిపోతుంది.. ఈ హోటల్లో యువత నచ్చే విధంగా రకరకాల తినుబండారాలను అందుబాటులో ఉంచుతున్నాడు ఆ హోటల్ యజమాని.
కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల తర్వాత … దేశంలో బొద్దింకల పేరుతో హోటల్స్ ఏర్పాటు అవుతున్నాయి. జనరేషన్ జెడ్ తరానికి చెందినవారే ఈ హోటళ్లకు వస్తున్నారు. యువత భారీగా వస్తున్న నేపథ్యంలో గిరాకీ కూడా బీభత్సంగానే ఉంది.. యువత నచ్చే విధంగా మెనూ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకుల గల్లా పెట్టెలు కూడా గలగలలాడుతున్నాయి. యూత్ ను అట్రాక్ట్ చేసి.. వ్యాపారం కొనసాగిస్తే ఎలా ఉంటుందో.. బొద్దింకల పేరుతో ఏర్పాటు చేస్తున్న హోటల్స్ నిరూపిస్తున్నాయి. ఏ వ్యాపారమైనా ట్రెండ్ ఆధారంగా సాగాలి. ట్రెండ్ ను అనుసరిస్తేనే లాభాలు దక్కుతాయి. బొద్దింకల పేరుతో హోటల్స్ ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశం అాదే.