Homeక్రైమ్‌Tirupati: కూతురి మొగుడితో అన్నీ.. చివరకు అల్లుడితో పెళ్లిదాకా వెళ్లి.. ఆఖర్లో ఊహించని ట్విస్ట్

Tirupati: కూతురి మొగుడితో అన్నీ.. చివరకు అల్లుడితో పెళ్లిదాకా వెళ్లి.. ఆఖర్లో ఊహించని ట్విస్ట్

Tirupati: నేటి కాలంలో మనుషుల మధ్య బంధాలు పలచనవుతున్నాయి. వావి వరసలు మాయమవుతున్నాయి. అడ్డగోలు సంబంధాలు ఏర్పడుతున్నాయి.. విచక్షణ కోల్పోవడంతో తిన్నావా అమ్మ నువ్వు మనుషులలో మృగాల సంతతి లక్షణాలు కనిపిస్తున్నాయి. అటువంటి సంఘటనే ఇది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో సభ్య సమాజం తలదించుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ప్రాంతంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. కె.బి.పురం మండలంలోని ఓ గ్రామంలో ఓ బాలుడు (18), ఓ బాలిక (15) ప్రేమలో కొనసాగారు.. వీరిద్దరూ ఇటీవల వివాహం చేసుకున్నారు.. వాస్తవానికి మైనార్టీ తీరకముందు వివాహం చేసుకోవడం నేరమైనప్పటికీ.. వీరిద్దరూ గుట్టుగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహానికి కుటుంబ సభ్యులు కూడా సమ్మతం తెలిపారు. ఆ బాలికకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. దీంతో ఆ బాలిక తల్లి కూడా వీరివద్దే వచ్చి ఉంటున్నది.

ఆ బాలుడు, బాలిక, ఆ తల్లి ఒకే చోట ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ బాలుడితో ఆ బాలిక తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుంది. బాలిక బయటికి వెళ్లడమే ఆలస్యం.. వారిద్దరూ తమ రస సంబంధంలో మునిగి తేలేవారు. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి శారీరక సంబంధం మరో స్థాయికి చేరింది. దీంతో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో బాగానే ఆ బాలిక పక్కన ఉండగానే ఆ తల్లి ఆ బాలుడుతో తాళి కట్టించుకోవాలని భావించింది. వీరి వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆ బాలిక అడ్డుకోబోయింది. అడ్డుకోబోయిన కూతురి తలను రోకలిబండతో కొట్టడానికి ఆ తల్లి ప్రయత్నించింది.

ఆ బాలిక ప్రాణ భయంతో కేకలు వేసింది.. గాయాలతో.. రక్తపు మరకలతో బయటకు వచ్చిన ఆ బాలికను చూసిన స్థానికులు.. ఆరా తీశారు. దీంతో ఆ బాలిక జరిగిన అసలు విషయం చెప్పడంతో.. ఒక్కసారిగా స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆ బాలిక ఉంటున్న చోటికి వెళ్లారు. ఈ దారుణానికి పాల్పడిన ఆ బాలిక తల్లి, బాలుడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత వారిద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular