spot_img
Homeసినిమా వార్తలు'ఎంజెలీనా జోలి' బెడ్‌ పై కూర్చున్నాను - పూరి

‘ఎంజెలీనా జోలి’ బెడ్‌ పై కూర్చున్నాను – పూరి

Angelina jolie
డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, అండ్ ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా ఆద్భుతంగానే ఉంటుంది. ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తెలియని ఎన్నో విషయాలను ముఖ్యంగా ప్ర‌పంచంలో వింత‌లను, విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా పూరి నుండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. టాపిక్ పేరు ‘వెన్నిస్’. ఇదొక న‌గరం. పూరి వెన్నిస్ నగరం గురించి చెబుతూ ‘హాలీవుడ్ న‌టి ఎంజెలీనా జోలి’ రూమ్ సంగతి కూడా చెప్పుకొచ్చాడు.

పూరి మాటల్లోనే.. ‘ఈ ప్ర‌పంచంలోనే అంద‌మైన న‌గ‌రాల్లో ‘వెన్నిస్’ నగరం కూడా ఒక‌టి. దీనికి వెన్నిసియా అని మరో పేరు కూడా ఉంది, ఇది ఇట‌లీ నార్త్ ఈస్ట్ సిటీ. బి.సి టెన్త్ సెంచ‌రీలో క‌ట్టారు. ఇందులో 118 ద్వీపాలుంటాయి. వాటి మీదే ఈ వెన్నిస్ సిటీని నిర్మించారు. అంటే, ప్ర‌తి ద్వీపానికి కాలువ‌ను క‌ట్టి వాటిని క‌నెక్ట్ చేస్తూ 400 బ్రిడ్జిల‌ను కట్టి సిటీని నిర్మించారు. ఇక ఈ సిటీలో కార్లు, బైకులు లాంటివి ఉండ‌వు. ఓ హౌస్ నుంచి మ‌రో హౌస్ కి వెళ్లాలంటే గండోలా అనే అంద‌మైన‌ ప‌డ‌వ వేసుకుని వెళ్లాల్సిందే.

పైగా ఈ సిటీలో అణువ‌ణువు అందంగానే ఉంటుంది. ముఖ్యంగా దీపాలు, బెంచీలు, అఖ‌రికి డ‌స్ట‌బిన్స్ కూడా ఎంతో అందంగా డిజైన్ తో కనిపిస్తాయి. ఇక్కడ చేసుకునే అతి పెద్ద పండ‌గ‌ పేరు కార్నివాల్. ఈ పండ‌గ రోజున అంద‌రూ ఫేస్ మాస్క్ వేసుకుని వ‌స్తారు. ఇక ఈ ప్ర‌పంచంలోనే మొద‌టి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన అమ్మాయి కూడా ఈ సిటీ అమ్మాయే. ఈ న‌గ‌రంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ్యూజిషియ‌న్స్ ఏదో ఒక వాయిద్యం వాయిస్తూ కనిపించడం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇక నేను వెన్నిస్ వెళ్లిన‌ప్పుడు హాలీవుడ్ న‌టి ‘ఎంజెలీనా జోలి’ అప్పుడే అక్క‌డ ఓ హోట‌ల్ లో ఉండి వెళ్ళింది అని తెలిసింది. నేను ఆ హోట‌ల్ కి వెళ్ళి షూటింగ్ చేయాలి, ఒక రూమ్ కావాలి, ఒకసారి రూమ్స్ చూస్తాను అని అబ‌ద్దం చెప్పి, ఎంజెలీనా ఉండి వెళ్లిన రూమ్ లో ఆమె ప‌డుకున్న బెడ్‌ పై కాసేపు కూర్చున్నాను. అదో శాటిస్పాక్ష‌న్‌. వెన్నిస్ న‌గ‌రం రోజు రోజుకీ మున‌గిపోతుంద‌ని, 2030నాటికి ఈ న‌గ‌రం స‌గం మునిగిపోయి ఘోస్ట్ సిటీ అవుతుంద‌ని చెబుతున్నారు. అది నిజ‌మో కాదో తెలియ‌దు. వీలైతే వెన్నిస్‌ను ఓసారి చూడండి. ఈ భూమి పై అంద‌మైన న‌గ‌రం అది’’ అని పూరి చెప్పుకొచ్చాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular