Puri Jagannadh blockbuster:తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎలివేట్ చేస్తూ సినిమాని సూపర్ సక్సెస్ చేయడంలో ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…అయితే గత కొన్ని రోజుల నుంచి ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడంతో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన భారీ రేంజ్ లో సినిమాలను చేయడమే కాకుండా మంచి సక్సెస్ లను సాధించడానికి ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన సూపర్ హిట్ సినిమాని ముగ్గురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ హీరోలు ఎవరు అనేది తెలుసుకోవడానికి ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…
Also Read: అసలు ఎన్టీఆర్ కు ఏమైంది? అనారోగ్యంతో బాధపడుతున్నాడా?
పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సినిమా కథని మొదట కొంతమంది హీరోలకి వినిపించారట. అందులో మొదట విజయ్ దేవరకొండ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఈయనతో ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలని అనుకున్న పూరి జగన్నాథ్ కి గడ్డు పరిస్థితి ఎదురైంది.
విజయ్ అప్పుడు బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయినని ఆ తర్వాత క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఈ సినిమా కథని జూనియర్ ఎన్టీఆర్ కి కూడా వినిపించారట. మరి పూరి జగన్నాథ్ అంతకుముందు టెంపర్ సినిమాతో ఎన్టీఆర్ కి మంచి సక్సెస్ అయితే అందించాడు. కానీ పూరి జగన్నాథ్ సినిమా చేసే సమయానికి సక్సెస్ లు లేకపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అతన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది.
Also Read: ఎల్లమ్మ విషయంలో కొత్త పద్ధతి అనుసరిస్తున్న దిల్ రాజు… గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్…
ఇక వీళ్ళ తర్వాత రవితేజ తో కూడా ఈ సినిమాని చేయాలని ప్లాన్ అయితే చేశారట. మరి మొత్తానికైతే ముగ్గురు స్టార్ హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా రామ్ కి చాలా బాగా సెట్ అయిందని విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేశారు… ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…