SS Rajamouli James Cameron : ఒక సినిమా తీసి సక్సెస్ ని సాధించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి చాలా టాలెంట్ ఉండాలి. ఒక సినిమా స్క్రీన్ మీద దృశ్య రూపంలో మనకు కనిపిస్తుందంటే 24 క్రాఫ్ట్స్ మొత్తం చాలా పకడ్బందీగా పని చేయాల్సిన అవసరమైతే ఉంది. అందులో ఏ ఒక్కరు చిన్న మిస్టేక్ చేసిన కూడా సినిమా బోల్తా కొడుతోంది. ఇక వీటన్నింటినీ ఆర్గనైజ్ చేసుకోవడానికి దర్శకుడు ప్రతి క్రాఫ్ట్ నుంచి బెస్ట్ అవుట్ పుట్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే తన సినిమాకి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని మాత్రమే తీసుకొని వాళ్ల నుంచి పూర్తి అవుట్ పుట్ ను రాబట్టుకొని సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక ఇంటి క్రమంలోనే దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రాజమౌళి ఇప్పటివరకు 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రతి ఒక్క టెక్నీషియన్ నుంచి ది బెస్ట్ అవుట్ ఫుట్ ని తీసుకుంటాడు… అందువల్లే ఆయన టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. హాలీవుడ్ లో సైతం అతనికి మంచి గుర్తింపు ఉందంటే అతని టాలెంట్ వల్లే అని చెప్పాలి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలోని సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడం పట్ల హాలీవుడ్ ప్రముఖులు సైతం రాజమౌళిని మెచ్చుకున్నారు.
ఇక రాజమౌళి ఫేవరేట్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళిని మెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు…గత నెలలో రాజమౌళి కండక్ట్ చేసిన ఒక పెద్ద ఈవెంట్ కి జేమ్స్ కామెరూన్ ముఖ్య అతిథిగా వస్తానని చెప్పాడట. కానీ అనుకోని కారణాల వల్ల రాలేకపోయాడట.
ఇక రాజమౌళికి జేమ్స్ కామెరూన్ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కామెరూన్ రాజమౌళి ని పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తనకు పోటీగా రాజమౌళి వస్తున్నాడేమో అనే ఉద్దేశంతోనే ఆయన అలాంటి వైఖరిని చూపిస్తున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరి కొంతమంది మాత్రం కామెరూన్ బిజీగా ఉండడం వల్ల ఆయన ఎవరికి పెద్దగా టైం ఇవ్వడం లేదంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజమౌళి మహేష్ బాబు చేస్తున్న సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకొని బాలీవుడ్ డైరెక్టర్లకు సైతం పోటీని ఇవ్వగలిగే రేంజ్ కి వెళ్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…