
ప్రస్తుతం అటు టీవీ ఇండస్ట్రీలో .. ఇటు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంది జబర్ధస్త్ యాంకర్ అనసూయ. ఆమె తన పారితోషికాన్ని భారీగా పెంచేసిందట.. రోజుకు ఏభై లక్షలు ఇస్తేనే అనసూయ ఒప్పుకుంటుందట. అనసూయ ఐటమ్ సాంగ్స్ ఖరీదు అంతనట..ఈ క్రమంలోనే మేకర్స్ కూడా వరుసగా ఆమెకు ఐటమ్ సాంగ్ లపై అవకాశాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారట. అసలు తనలోని నటిని కూడా వాడుకోండి అని అనసూయ ఎంత మెతుకుంటున్నా.. దర్శకులు మాత్రం ఆమెలోని సెక్సీ నెస్ కే ఓటు వేస్తున్నారట. అందుకే అందరూ ఐటమ్ సాంగే ఇస్తున్నారట, అయితే దీన్ని సైతం ‘క్యాష్’ చేసుకోవాలని అనసూయ ఫిక్స్ అయిందట.
యాంకర్ అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ లోనే బిజీ నటిగా ఓ వైపు టీవీ షోల్లో, మరోవైపు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువగా చాన్సులు కొట్టేస్తుంది. ‘జబర్దస్త్’ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చి.. వెండితెరపై ‘క్షణం’, ‘రంగస్థలం’ లాంటి సినిమాల ద్వారా స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమెకు ఎన్నో అవకాశాలు రావడంతో ఏ ఒక్కటి కాదనకుండా నటించేస్తోంది. కేవలం నటనపరంగానే కాకుండా ఐటెం సాంగుల్లో కూడా నటిస్తూ అందరినీ మెప్పించింది. ఇటీవల అనసూయ ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ త్వరలో ప్రసారం కానుంది. అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గురించి అనసూయ చెప్పిన డైలాగులు వైరల్ అవుతున్నాయి.
‘‘పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఉన్న ‘ఇట్స్ టైం టు పార్టీ నౌ’పాటలో నన్ను చేయమన్నారు. అయితే నేనొక్కదాన్ని అయితే చేస్తానన్నాను. కానీ నాతో పాటు మరికొందరు ఉంటానంటే నేను ఒప్పుకోలేదు. అందుకే రిజెక్ట్ చేశాను. అయితే కొంతమంది నువ్వు పవన్ ను రిజెక్ట్ చేసేది ఏంది అని నన్ను డిసైరబుల్ లిస్ట్లో పెట్టారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ కాలి గోటికి సరిపోవన్నారు. ఫిల్మ్ ఫేర్ అవార్డులో నన్ను అవమానించారు..’’ అని అనసూయ చెప్పారు. ఓ రోజు రాత్రి నేను బాగా తాగి ఉన్నానని, ఆ సమయంలో.. అని ప్రొమోలో చెప్పిన అనసూయ పూర్తి వీడియోలో ఏం చెబుతుందోనని అందరూ ఆసక్తిగా ఆ ఇంటర్వ్యూకోసం ఎదురుచూస్తున్నారు.