Homeఆంధ్రప్రదేశ్‌Independence Day 2026: అంతటా స్వాతంత్ర శోభ.. ఆ డాగ్ పరేడ్ కు పవన్ ఫిదా!

Independence Day 2026: అంతటా స్వాతంత్ర శోభ.. ఆ డాగ్ పరేడ్ కు పవన్ ఫిదా!

Independence Day 2026: అమరావతి రాజధానిలో మరో సరికొత్త ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తొలిసారిగా అమరావతిలో విజయవంతం అయ్యాయి. రాజధాని పరిధిలోని రాయపూడి సమీపంలో.. పరేడ్ మైదానంలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్వర్ణాంధ్ర 2047 ధీమ్ తో ఈ వేడుకలను నిర్వహించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. భార్య అన్నా కొణిదల సైతం పాల్గొన్నారు. జాతీయ […]

Independence Day 2026: అమరావతి రాజధానిలో మరో సరికొత్త ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తొలిసారిగా అమరావతిలో విజయవంతం అయ్యాయి. రాజధాని పరిధిలోని రాయపూడి సమీపంలో.. పరేడ్ మైదానంలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్వర్ణాంధ్ర 2047 ధీమ్ తో ఈ వేడుకలను నిర్వహించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. భార్య అన్నా కొణిదల సైతం పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి పరేడ్ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఓ డాగ్ పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కు పూల బొకే అందించి ఆకట్టుకుంది.

* శునకాల గౌరవ వందనం..
గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా శునకాల గౌరవ వందనం ఏర్పాటు చేశారు జిల్లా పోలీసులు. వాటి నుంచి గౌరవ వందనం స్వీకరించడంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఫిదా అయ్యారు. మరోవైపు ఆయన భార్య అన్నా కొణిదల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ గౌరవ వందనం స్వీకరించే సమయంలో గొప్ప ఆనందంతో కనిపించారు. నిన్ననే ఆమె పిఠాపురంలో పర్యటించారు. అక్కడ పాదుగయా క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ద్రాక్షారామంలో కూడా సందర్శించారు. ఈ క్రమంలో తెలుగులో మాట్లాడుతూ అక్కడ ఉన్న వారిని ఆకట్టుకున్నారు. ఈరోజు భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి కాకినాడలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. మరోవైపు విజయవాడలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. జాతీయ జెండాను ఆవిష్కరించి.. గౌరవ వందనం స్వీకరించారు.

* కడియం నర్సరీలో వినూత్న ప్రదర్శన..
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కడియం నర్సరీ రైతులు వినూత్న ప్రదర్శన ఏర్పాటు చేశారు. 150 సంవత్సరాల వందేమాతరం స్ఫూర్తిని మొక్కలతో ప్రత్యేకంగా ఒక ఆకృతిని తీర్చిదిద్దారు. వందేమాతరం స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేప్పాలన్న ఉద్దేశంతో ఇలా ప్రదర్శన చేపట్టారు. ఏకంగా 85 వేల మొక్కలను ఉపయోగించారు. దాదాపు వారం రోజులపాటు శ్రమించి ఈ ఆకృతిని తీర్చిదిద్దారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మిన్నంటాయి.

 

View this post on Instagram

 

A post shared by Mega9tv Telugu (@mega9tv_telugu)

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper