ఉమ్మడి ఆంధ్రపదేశ్ విభజన అనంతరం ఆంధ్రపదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో అధికారం చేపట్టిన టిడిపి ప్రభుత్వం తుళ్ళూరు కేంద్రంగా 29 గ్రామాలను ఎంపిక చేసి రాజధానిగా ప్రకటించింది. ఇక్కడి రైతులు కొందరు స్వచ్ఛందంగా తమ భూములు ఇవ్వగా మారి కొందరు బెదిరింపులకు జడిసి భూములు ఇవ్వగా… మొత్తం 32 వేల ఎకరాలను భూసమీకరణ పథకంలో ప్రభుత్వం సమీకరించింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు అవలంభించిన తీరే ఇప్పడు అమరావతికి శాంపంగా మారిందని రాజకీయ విశ్లేషకులు వాధన. చంద్రబాబు రాజధాని విషయంలో అనుసరించిన వ్యూహాలు, చేపట్టిన పనులు, కల్పించిన ప్రచారం… ఇలా అన్ని విషయాలు అమరావతి మనుగడను ప్రశ్నార్ధకం చేశాయి. ఫలితంగా ఇప్పడు అక్కడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
Also Read: వాళ్లకు జగన్ వద్దు, బాబే ముద్దు ..!
రాజధాని పేరుతో రాజకీయంగా లబ్ధిపొందాలని చంద్రబాబు వ్యూహం పన్నారు. అమరావతి నిర్మాణానికి 2016లో ప్రారంభమయై 2050 నాటికి పూర్తయ్యేటట్లు అతి భారీ ప్రణాళిక వేశారు, రూ.5 లక్షల కోట్లు వ్యయంతో నవ నగరాలను నిర్మించాలని భావించారు. అప్పట్లోనే ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2050 వరకూ చంద్రబాబే సిఎంగా కొనసాగుతాడా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించారు. రాజధానిని అడ్డుపెట్టుకుని 2050 వరకూ పాలన హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు వ్యూహం, అయినప్పటికీ ప్రజలు దీనికి మద్దతు ఇవ్వలేదు. కనీసం రాజధాని వాసులు కూడా ఇందుకు అంగీకరించలేదు. 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాల్లో టిడిపి పరాజయం పాలయ్యింది.
ఇంత భారీ స్థాయిలో ప్రణాళికలు చేపట్టిన చంద్రబాబు గడచిన ఐదేళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేటాయించింది కేవలం రూ.9,600 కోట్లు మాత్రమే, ఇందులో రూ.1,500 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకే అధిక మొత్తం ఖర్చు చేయడం వల్ల రాజధానిలో భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ కోసం రూ.1,500 కోట్ల వరకూ ఖర్చు చేశారు. భారీ ప్రణాళికతో ముందుకెళ్లడంతో ఇప్పటికీ రాజధానికి ఒక రూపు రేఖ లేకుండా పోయింది. కేవలం పాలనా పరమైన రాజధాని నిర్మణం గత ఐదేళ్లలో అమరావతిలో పూర్తి చేసి దశల వారీగా రాజధానిని విస్తరించే ప్రణాళిక రూపొందించుకుని అమలు చేసి ఉంటే అమరావతి నుంచి రాజధానిని మార్చడానికి అవకాశం ఉండేది కాదనే వాధనలు వినిపిస్తున్నాయి.
స్వతహాగా పబ్లిసిటీ అతిగా కోరుకునే చంద్రబాబు రాజధాని విషయంలోను అతిగా పబ్లిసిటీ చేశారు. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించారు. ఇతర దేశాలతోనే రాజధానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో ఒప్పందాలు కుదర్చుకోవడం, మాస్టర్ ప్లాన్ రూపలక్పన, రాజధాని అభివృద్ధి, ఇతర అంశాలకు సంబంధించి సింగపూర్, జపాన్ సంస్థలకు ఆయన పనులు అప్పగించారు. ప్రతి ఏటా దేశ విదేశాల ప్రతినిధులను ఆహ్వానించి సీఆర్డీఏ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు. చివరికి అమరావతి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అమరావతి… అనే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇది ప్రభుత్వ వ్యవహారంగా సాగకుండా సొంత ఇమేజ్ కోసం ప్రయత్నం చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమయ్యిందనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతుంది. టిడిపి వ్యతిరేక ప్రభుత్వాలు ఇటువంటి అంశాన్ని ఎలా కొనసాగిస్తాయని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హైదరాబాదును తానే నిర్మించానని ప్రతి వేదికపైనా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. నిజాం నవాబు నుంచి రాజశేఖర్ రెడ్డి వరకూ పాలకులెవరూ హైదరాబాదును అభివృద్ది చేయాలేదా?
రాజధాని అమరావతి విషయంలో సామాజిక వర్గం ముద్ర పడుతుంటే ముందు నుంచి చంద్రబాబు ఆ ముద్రను తొలగించ లేకపోయారు. భూ సమీకరణ విషయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్ద రైతులు ముందుండి వ్యవహారాన్ని నడిపించారు. పలు మార్లు హైదరాబాదులో ఉన్న చంద్రబాబు వద్దకు ప్రత్యేక బస్సుల్లో రైతులను తీసుకువెళ్లి సమావేశ పర్చడంలో ఆ వర్గం వారే ఉన్నారు. భూ సమీకరణకు భూములు ఇచ్చిన వారిలో అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నా… రాజధాని ప్రకటించక ముందు, అనంతరం అక్కడ భూములను ఆ సామాజికవర్గానికి చెందిన వారే అధికంగా కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్నే ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా వాడుకుంటుంది.
Also Read: కేసీఆర్ కూతురును వెంటాడుతున్న దురదృష్టం?
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఏ రోజు ఇతర పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లలేదు. అఖిల పక్షం సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు నెత్తి నోరు మొత్తుకున్నా వినలేదు. రాజధాని విషయంలో ఇతర పార్టీలను జోక్యం చేసుకోనివ్వలేదు. మాస్టర్ ప్లాన్, నిర్మాణం, ఇతర విషయాలలో ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించలేదు. అందరి భాగస్వామ్యం తీసుకుని అమరావతి అందరిదీ అనే భావన కలిగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదనే విషయాన్ని విపక్ష పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అధికారం పోయిన అనంతరం అమరావతి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి పోరాటం చేయాలని ఇప్పడు చంద్రబాబు కోరుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అనే అంశాలను గుర్తించి అటువంటి అవకాశాలు లేకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడం, అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవడం వంటి విషయాలలో చంద్రబాబు ముందు చూపు లేకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజధాని గ్రామాల్లో పర్యటించిన సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టిడిపి ప్రభుత్వం భలవంతంగా తీసుకున్న భూములను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజకీయ కారణాలతో అమరావతిని రాజధానిగా అంగీకరించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో పాలనా వికేంద్రీకరణ పేరుతో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధాని గా నిర్ణయించింది. చంద్రబాబు చేసిన చట్టాలు వైసీపీ ప్రభుత్వం రాజధాని తరలించకుండా అడ్డుకోలేకపోయాయి. దీంతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా ముందుకు వెళుతుంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Chandrababus policies are a curse to amaravati
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com