TDP
TDP : తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) బలమైన వాయిస్ ఉన్న నేతలు ఉన్నారు. కానీ ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది సైలెంట్ అయ్యారు. అందులో దేవినేని ఉమా ఒకరు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఉమా చాలా యాక్టివ్ గా కనిపించారు. అయితే కూటమి 10 నెలల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఇటీవల దేవినేని ఉమా ఆచూకీ కనిపించడం లేదు. ఆయన ఎక్కువగా హైదరాబాద్ కి పరిమితమవుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. గడిచిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఆయనకు ప్రాధాన్యత దక్కలేదు. కనీసం ఎమ్మెల్సీగా కూడా ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఈ కారణాలతోనే ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : వక్ఫ్ సవరణ బిల్లులో టిడిపి మార్క్.. వాటికి జై కొట్టిన కేంద్రం!
* బలమైన రాజకీయ నేపథ్యం
బలమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు దేవినేని ఉమా( devineni Uma Maheshwar Rao ). 1999లో దేవినేని రమణ అకాల మరణంతో ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు దేవినేని ఉమ. అప్పట్లో నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు దేవినేని రమణ. ఆయన మరణంతో ఉప ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన సోదరుడు దేవినేని ఉమామహేశ్వరరావు. మంచి మెజారిటీతో గెలిచారు. తనకంటూ గుర్తింపు సాధించుకున్నారు. 2004లో సైతం రెండోసారి నందిగామ నుంచి పోటీ చేసి గెలిచారు ఉమా. 2009లో నందిగామ నియోజకవర్గం పునర్విభజనలో కనుమరుగు అయ్యింది. మైలవరం నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఆ ఎన్నికల్లో మైలవరం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఉమా గెలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో అధికారంలోకి రాలేదు.
* మారిన జగన్ నిర్ణయం..
2014 ఎన్నికల్లో దేవినేని ఉమా ను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. మైలవరం నుంచి జోగి రమేష్ ను బరిలోదించారు. అయినా సరే దేవినేని ఉమ మంచి మెజారిటీతో గెలవడంతో తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఐదేళ్లపాటు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగి తన హవాను చాటుకున్నారు దేవినేని ఉమ. కృష్ణాజిల్లా అంటే ఉమా.. ఉమా అంటే కృష్ణాజిల్లా అన్నట్టుగా ఐదేళ్లుగా పరిస్థితి కొనసాగింది. అయితే 2019 ఎన్నికల్లో సీన్ మారింది. మైలవరం నుంచి బరిలో దిగిన దేవినేని ఉమా పై విజయం సాధించారు వసంత కృష్ణ ప్రసాద్. అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు.
* సీటు త్యాగం
అయితే గత ఐదేళ్లలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్( Vasantha Krishna Prasad) టిడిపి గూటికి చేరారు. దీంతో ఆయన కోసం సీటు త్యాగం చేయాల్సి వచ్చింది దేవినేని ఉమాకు. చంద్రబాబు సర్దుబాటు చేసేసరికి ఒప్పుకున్నారు దేవినేని ఉమా. అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతోంది. మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేశారు. సుమారు 8 వరకు ఎమ్మెల్సీలను నియమించారు. కానీ దేవినేని ఉమాకు చాన్స్ దక్కలేదు. అందుకే ఆయన హైదరాబాద్ కు పరిమితం అయినట్లు తెలుస్తోంది. టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం.
Also Read : గౌరవానికి తగ్గట్టు పదవులు.. టిడిపిలో ఆ ఇద్దరూ కోరుకున్నది అదే!
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Tdp former minister silent reason