Chandrababu Naidu
Chandrababu Naidu : ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) క్రమశిక్షణ గురించి వేరే చెప్పనవసరం లేదు. ఇండియన్ మోస్ట్ పాపులర్ లీడర్ ఆయన. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఆయన భార్య నారా భువనేశ్వరి అన్యోన్య దాంపత్యం గురించి ఎన్నోసార్లు వినే ఉంటాం. ఆమె కోసం చంద్రబాబు బయటకు వెళ్లినప్పుడు వీలు కుదిరినప్పుడల్లా షాపింగ్ కూడా చేస్తుంటారు. ఇదే క్రమంలో ఈరోజు బాపట్ల జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఈ తరుణంలో తన భార్య భువనేశ్వరి కోసం ఒక పట్టు చీర కొనుగోలు చేశారు. అక్కడే మహిళలు ఏర్పాటు చేసిన ఓ స్టాల్లో చీరను చూసి ముచ్చటపడిన ఆయన దానిని తన భార్య భువనేశ్వరి కోసం కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇదే ఏపీ పొలిటికల్ సర్కిల్లో వైరల్ అంశంగా మారింది.
Also Read : ముస్లింల హెచ్చరిక.. రేపు మహాధర్నా.. సంకటంలో చంద్రబాబు!
* భువనేశ్వరి ఆసక్తికర కామెంట్స్
అయితే ఇటీవల సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ) రిలాక్స్ అయ్యారు. ఈ క్రమంలో కొన్ని కార్యక్రమాల్లో తన భర్త గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. చంద్రబాబు పాలనలో బిజీగా ఉంటారని.. ఆయన కుటుంబ జీవనం కంటే రాష్ట్ర ప్రజల కే అత్యంత ప్రాధాన్యం ఇస్తారని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు. గతంలో ఓసారి తన కోసం చీర తీసుకొచ్చారని.. కానీ అది తనకు నచ్చలేదని.. అయినా సరే ఆయన తేవడంతో ఎంతో సంతోషించానని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు తన భారీ కోసం ముచ్చటగా ఓ చీరను కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది.
* ప్రతి నెలలో జిల్లాల పర్యటన..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెల పింఛన్ల పంపిణీకి గాను రాష్ట్రంలో ఒక జిల్లాను చంద్రబాబు ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఉమ్మడి ప్రకాశం( Prakasam district) జిల్లాలో పింఛన్ల పంపిణీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి సమీపంలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అక్కడ వారి పెట్టిన వస్తువుల గురించి ఆరా తీశారు. ఇదే క్రమంలో చీరల స్టాల్ వద్దకు కూడా వెళ్లారు. ఉన్నట్టుండి ఓ పసుపు చీర ఆయనకు బాగా ఆకట్టుకుంది. వెంటనే దానిని కొనుగోలు చేశారు.
* వ్యాపారాలు కుటుంబ సభ్యులకు అప్పగింత
సాధారణంగా చంద్రబాబు ప్రజా జీవితంలో బిజీగా ఉంటారు. తన రాజకీయ జీవితంలో ప్రారంభ సమయంలో హెరిటేజ్( heritage) పాల పరిశ్రమను ఏర్పాటు చేశారు చంద్రబాబు. తరువాత ఆ పరిశ్రమను నారా భువనేశ్వరి.. అటు తరువాత నారా బ్రాహ్మణి నిర్వహిస్తూ వచ్చారు. అయితే రాజకీయ జీవితంలో బిజీగా ఉన్న చంద్రబాబు వ్యాపార లావాదేవీలను తన కుటుంబానికి అప్పగించారు. అయితే ప్రజా జీవితంలో బిజీ అయిన చంద్రబాబు ఎన్నడు కుటుంబం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని.. కుటుంబ బాధ్యతలు తానే చూసుకున్నానని నారా భువనేశ్వరి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తన వ్యక్తిగత అభిరుచులు సైతం చంద్రబాబుకు తెలియని చాలా సందర్భాల్లో బయటపెట్టారు భువనేశ్వరి. అయితే తాజాగా చంద్రబాబు భువనేశ్వరి కోసం ముచ్చటపడి ఓ చీరను తీసుకోవడం మాత్రం ఇప్పుడు వైరల్ అంశం గా మారింది.
Also Read : చంద్రబాబుకు పాదాభివందనం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ!
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Chandrababu naidu selected saree for bhuvaneshwari
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com