Homeఆంధ్రప్రదేశ్‌TDP: గౌరవానికి తగ్గట్టు పదవులు.. టిడిపిలో ఆ ఇద్దరూ కోరుకున్నది అదే!

TDP: గౌరవానికి తగ్గట్టు పదవులు.. టిడిపిలో ఆ ఇద్దరూ కోరుకున్నది అదే!

TDP: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఎంతోమంది నేతలకు ఛాన్స్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీఆర్ అయినా.. ఆ పార్టీకి ఎక్కువ కాలం సారథ్యం వహించింది మాత్రం చంద్రబాబు. ఈ లెక్కన ఉమ్మడి రాష్ట్రంలో చాలామందికి అవకాశాలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో జూనియర్లకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఈ క్రమంలో కొంతమంది సీనియర్లను పక్కకు తప్పించారు. వారి బదులుగా వారసులకు అవకాశాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలో ఉండడం.. కేంద్రంలో చంద్రబాబు కీలక భాగస్వామి కావడం.. కేంద్రం వద్ద పలుకుబడి ఉండడంతో తమకు పదవులు ఇవ్వాలని సీనియర్లు కోరుతున్నారు. తమ హోదాకు తగ్గట్టు పదవి ఇచ్చి గౌరవప్రదమైన పదవీ విరమణ ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. అటువంటి నేతల్లో పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు వంటి వారు ఉన్నారు. వీరిద్దరూ చంద్రబాబుకు కావాల్సినవారే. చంద్రబాబుకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చిన వారే. అందుకే కీలకమైన పదవులు ఇచ్చి తమకు గౌరవం కల్పించాలని కోరుతున్నారు.

Also Read: ముంబైకి తరలింపు.. కొడాలి నాని పరిస్థితి విషమంగా ఉందా?

* గౌరవ నేతగా..
విజయనగరం జిల్లా అంటే ముందుగా గుర్తుకొచ్చేది అశోక్ గజపతిరాజు( Ashok gajpati Raju ). అక్కడ సామాజిక వర్గపరంగా తూర్పు కాపులు, వెలమ సామాజిక వర్గం అధికంగా ఉన్నా.. తెలుగుదేశం పార్టీ పరంగా అశోక్ గజపతిరాజుకు ఎనలేని గౌరవం ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఆయనను గౌరవిస్తారు. అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభానికి విరుగుడుగా చంద్రబాబు నాయకత్వానికి అండగా నిలిచింది అశోక్ గజపతిరాజు. అందుకే అశోక్ గజపతిరాజు అంటే చంద్రబాబుకు కూడా ఎంతో గౌరవం. అయితే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు అశోక్. ఆయన కుమార్తెకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు తన వయసుకు తగ్గ గౌరవాన్ని కోరుకుంటున్నారు అశోక్ గజపతిరాజు. గవర్నర్గా తనకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అది కాకుంటే రాజ్యసభ పదవి ఇచ్చి పెద్దల సభలో అడుగు పెట్టేలా చూడాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

* చంద్రబాబు ప్రయోజన కారిగా..
చంద్రబాబుకు అత్యంత ప్రయోజనం చేకూర్చింది అంటే.. యనమల రామకృష్ణుడే( yanamalai Ramakrishnudu) . నాడు యనమల నిర్ణయం తీసుకోకుంటే చంద్రబాబు ఇంతటి రాజకీయ ఉన్నతి సాధించేవారు కాదు. 1995 టిడిపి సంక్షోభ సమయంలో స్పీకర్ గా యనమల రామకృష్ణుడు ఉండేవారు. నందమూరి తారక రామారావు నుంచి పదవి అందుకోవడంలో స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడి పాత్ర ఉంది. నాడు ఆయన కానీ సహకరించకుంటే చంద్రబాబు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కష్టం. అయితే టిడిపి సంక్షోభ సమయంలో చంద్రబాబుకు అండగా నిలబడటం వల్లే యనమల రామకృష్ణుడు ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వచ్చింది. అయితే 2004లో తుని నియోజకవర్గంలో ఓటమి ఎదురయ్యేసరికి ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు యనమల రామకృష్ణుడు. అయినా సరే 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడును మంత్రివర్గంలోకి తీసుకొని ఆర్థిక శాఖను కట్టబెట్టారు చంద్రబాబు. తన అభిమానాన్ని చాటుకున్నారు.

* సానుకూల హామీ..
అయితే ఈ ఎన్నికల్లో యనమల కుమార్తె దివ్య( Divya) పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్న రామకృష్ణుడు ఇటీవల పదవి విరమణ చేశారు. కానీ ఆయనకు రెన్యువల్ లభించలేదు. అయితే తనకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. గవర్నర్ పదవి కానీ.. రాజ్యసభ పదవికి కానీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన యనమల రామకృష్ణుడు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ తరువాత ఆయన టిడిపి హై కమాండ్ కు సానుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. దీంతో ఆయనకు హై కమాండ్ నుంచి బలమైన హామీ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరు నేతలు తమ గౌరవానికి తగ్గట్టు పదవులు కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular