Industrial Development In AP: ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై ( industrial development) కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. పారిశ్రామికవేత్తలను ఒప్పించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూముల కేటాయింపు, రాయితీలు వంటివి ప్రకటిస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి తిరోగమనంలో పయనించింది. దానిని సరి చేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. అయితే రాష్ట్రానికి పెట్టుబడులు వద్దు.. కంపెనీలు వద్దు.. ఉద్యోగాలు ఇవ్వద్దు అన్న రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తోంది.
Also Read: ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి.. అమిత్ షా తో చంద్రబాబు భేటీ!
* పరిశ్రమల యాజమాన్యాలకు బెదిరింపులు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వం ఐదేళ్ల పాటు సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుంది. పారిశ్రామిక ప్రగతిని గాలికి వదిలేసింది. ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రతినిధులు పరిశ్రమల యాజమాన్యాలకు బెదిరించారు. ఈ క్రమంలో ఏపీ నుంచి చాలా పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. ముఖ్యంగా అమర్ రాజా లాంటి ప్రముఖ కంపెనీ తన ఉత్పత్తి విస్తరణకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరించడంతో విసిగి వేసారి పోయింది అమర్ రాజా యాజమాన్యం. ఇలా ఉన్న పరిశ్రమలు తరలిపోయాయి. కొత్త పరిశ్రమల జాడ లేకపోయింది. ఉద్యోగాల కల్పన లేకుండా పోయింది.
* పారిశ్రామిక ప్రగతి పరుగు..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో పారిశ్రామిక ప్రగతి పరుగు పెట్టింది. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే చాలామంది పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ తనదైన పాత్ర పోషిస్తున్నారు. తన బృందంతో అమెరికా వెళ్లి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దావోస్ పెట్టుబడుల సదస్సుకు సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. పరిశ్రమలతో పాటు ఐటీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటిస్తోంది కూటమి ప్రభుత్వం. మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు త్వరితగతిన భూ కేటాయింపులు కూడా చేస్తోంది. ఇది ఎంత మాత్రం వైసిపి నేతలకు మింగుడు పడడం లేదు. అందుకే పరిశ్రమలకు భూ కేటాయింపులు, రాయితీలపై విష ప్రచారం చేస్తున్నారు. వాటికి భూ కేటాయింపులు అవసరమా అని ప్రజల్లో ఒక రకమైన అయోమయాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
* ఐటి హబ్ గా విశాఖ..
విశాఖ నగరాన్ని( Visakha City) ఐటి హబ్ గా మార్చాలి అన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. దీనికోసం మంత్రి నారా లోకేష్ సైతం ఎంతగానో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా టిసిఎస్, గూగుల్ వంటి సంస్థలతోపాటు కాపులుప్పాడలో డేటా సెంటర్ కోసం ఎకరానికి 50 లక్షలు చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని హిల్ నెంబర్ 3 లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరా భూమి కోటి రూపాయల చొప్పున.. 3.5 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తేవడానికి రెండేళ్ల గడువు విధించింది. అయితే ఇది అందుబాటులోకి వస్తే లక్షలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై విష ప్రచారం చేస్తోంది. జిల్లాకు ఒక ప్యాలెస్ పట్టుకునేందుకు విలువైన భూములను కేటాయించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిది. కానీ ఇప్పుడు నిరుద్యోగ యువత కోసం పరిశ్రమలకు భూములు కేటాయింపు చేస్తే తట్టుకోలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. ప్రజలు గుణపాఠం నేర్పినా.. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు తమ తీరు మార్చుకోకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
Also Read: పదవుల కోసం జగన్ కు సాష్టాంగ నమస్కారాలు.. నిజం ఎంత?