TDP : ప్రఖ్యాత జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి నాలుగు ప్రతిపాదనలను తెలుగుదేశం కేంద్రం ఎదుట ఉంచగా.. వాటిలో మూడింటిని కేంద్రం ఆమోదించింది.. అయితే వీటికి సంబంధించి ఇండియా టుడే సంచలన నివేదికను వెల్లడించింది. దాని ప్రకారం..
Also Read : త్రిభాషా విధానంపై వివాదం.. యోగి–స్టాలిన్ డైలాగ్ వార్!
యూజర్ ద్వారా వక్ఫ్.. దీనికి అర్థం “ఇప్పటికే వక్ఫ్ బై యూజర్” నమోదు చేసిన వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన కేసులను తిరిగి ఓపెన్ చేయరు. వాటికి వక్ఫ్ డీడ్ లేకపోయినప్పటికీ అవి వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయి. వక్ఫ్ ఆస్తుల విషయంలో కలెక్టర్ తీసుకున్న నిర్ణయం తుది కాదు. ఆస్తులకు సంబంధించి డిజిటల్ పత్రాలను సమర్పించడానికి గడువును ఆరు నెలలకు పొడిగించారు. ఈ సవరణలను కేంద్రానికి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించగా.. దానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇవన్నీ కూడా బాగున్నాయని.. వీటివల్ల ముస్లింలలో ఉన్న అపోహలు తొలగిపోతాయని కేంద్రం పేర్కొంది.. ఇదే విషయాన్ని ఇండియా టుడే తన నివేదికలో వెల్లడించింది..
ముస్లిం సమాజం పోరాడాలి
వక్ఫ్ ఆస్తులలో ముస్లిమేతరుల ప్రమేయాన్ని నిరోధించాలని తెలుగుదేశం పార్టీ కేంద్రానికి సూచించింది.. అయితే దీనిని కేంద్రం ఆమోదించలేదు. హిందూ దేవాలయాల విషయంలో వేరే మతస్తుల ప్రమేయాన్ని ఒప్పుకోరు. ముస్లింలు కూడా తమ మత వ్యవహారాలలో ఇతరుల ప్రమేయాన్ని ఒప్పుకోరు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా గట్టిగానే పోరాడుతోంది. ముస్లిం ఆస్తుల విషయంలో ఇతరుల ప్రమేయాన్ని నిరోధించాలని.. అసలు అటువంటి ఆలోచన చేయకూడదని తెలుగుదేశం పార్టీ పలు సందర్భాల్లో కేంద్రానికి విన్నవించింది. అయితే దీనిపై కేంద్రం తెలుగుదేశం పార్టీ కోరుకున్న నిర్ణయాన్ని తీసుకోలేదు. దీనిపై మొదటి నుంచి కూడా టిడిపి గట్టిగా పోరాడుతున్న నేపథ్యంలో.. ముస్లిం సమాజం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అయితే వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి వైఎస్ఆర్సిపి ఇంతవరకు ఒక్క డిమాండ్ లేదా.. ప్రతిపాదనను కేంద్రం ఎదుట ఉంచలేదు. తనదైన వాణి కూడా వినిపించలేదు. ముస్లిం ఓట్లు మాత్రం వైఎస్ఆర్సిపికి కావాలి.. వారి సమస్యల పరిష్కారానికి మాత్రం ఆ పార్టీ కృషి చేయదు. ముస్లిం సమాజం ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి.. వక్ఫ్ సవరణ చట్టంలో తమ పార్టీ చేస్తున్న కృషిని గుర్తించాలని టిడిపి నాయకులు పేర్కొంటున్నారు..
ముస్లింలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంది
” వైఎస్ఆర్సిపి నాయకులకు ముస్లింల మీద చిత్తశుద్ధి లేదు. ముస్లిం సమస్యల మీద ఏ మాత్రం అవగాహన లేదు. ఇటీవల రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇస్తున్న ఇఫ్తార్ విందును బాయ్ కాట్ చేయాలని ముస్లింలను వైఎస్ఆర్సిపి రెచ్చగొట్టింది. కానీ ముస్లింల సమస్యల పరిష్కారానికి మొదటి నుంచి కృషి చేసిన చంద్రబాబు నాయుడు మీద మత పెద్దలు నమ్మకం ఉంచారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు చేసిన విద్వేషపూరితమైన ప్రసంగాలను నమ్మలేదు. చివరికి చంద్రబాబు నాయకత్వాన్ని వారు నమ్మారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకొని కేంద్రం ఎదుట నాలుగు ప్రతిపాదనలు ఉంచారు. ఇందులో మూడు ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. దీనిని బట్టి ముస్లింలపై చంద్రబాబు నాయుడుకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని” టిడిపి నేతలు అంటున్నారు.
Also Read : 3,800 కోట్లు.. రతన్ టాటా దాతృత్వానికి ఇదో ఉదాహరణ మాత్రమే..