Budget friendly cars 2025: చిన్న ఫ్యామిలీ అయినా సరే సొంతంగా కారు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. అందుకే భారతదేశంలో కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఉన్నత వర్గాలు, కింది వర్గాల కంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా కారు కోసం ఎదురు చూస్తున్నారు. వీరి కోసం కంపెనీలు సైతం కన్వీనెంట్ గా ఉండేందుకు తక్కువ ధరలో కార్లను అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల కార్లు అందుబాటులో ఉన్నా.. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్తవి రాబోతున్నా.. కొన్ని కార్లకు మాత్రం ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అలా డిమాండ్ ఉన్న కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
భారతదేశంలో మారుతి సుజుకి కంపెనీకి దశాబ్దాలుగా ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఈ కంపెనీ నుంచి ఏదైనా కారు మార్కెట్లోకి వస్తుందంటే అది కచ్చితంగా మిడిల్ క్లాస్ కోసమేనని చాలామంది భావిస్తారు. అనుకున్నట్లుగానే కంపెనీ సైతం సాధారణ ధరతో వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ కంపెనీ నుంచి మిడిల్ క్లాస్ కు అనుగుణంగా ఉండే కారు S-Presso. ఈ కారు ఇప్పటికే చాలామంది సొంతం చేసుకున్నారు. అయినా కూడా దీని ధర ఎక్స్ షోరూమ్ లో రూ.3,49,900 గా ఉంది. అంటే అన్ని కలిపి రూ. 4 లక్షల వరకు దీనిని సొంతం చేసుకోవచ్చు. 998 సీసీ ఇంజన్ తో పనిచేసే ఇది5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ తోపాటు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఇదే కంపెనీ నుంచి ఉన్న మరో కారు ఆల్టో k- 10. ఈ కారు రూ.5.45 లక్షల వరకు ధర ఉంది. దశాబ్దాలుగా ఈ మోడల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ఉన్న కారు కంటే అప్డేట్ వెర్షన్తో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. 5 సీటర్ గా ఉండే ఈ కారులో లాంగ్ జర్నీ కూడా అద్భుతంగానే ఉంటుంది. అతి తక్కువ ధరలో కార్లు కొనేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రెనాల్ట్ కంపెనీకి చెందిన క్విడ్ అనే కారు కూడా మధ్యతరగతి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనిని రూ. 4.30 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు ఆటోమేటిక్ గేర్ సిస్టం అందుబాటులో ఉంది. అలాగే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉండడంతో రక్షణ వ్యవస్థ కూడా పటిష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
భారతదేశంలో అత్యధికంగా కార్లను విక్రయించే కంపెనీలో టాటా ఒకటి. ఈ కంపెనీ నుంచి తక్కువ ధరలో సేఫ్టీ కారు గా పేరు తెచ్చుకుంది టియాగో. దీనికి ఎంత డిమాండ్ ఉన్నా.. రూ.4.57 లక్షల ప్రారంభద్ర తో విప్లయిస్తున్నారు. మారుతి కంపెనీకి చెందిన కార్లకు ఈ కారు గట్టి పోటీ ఇస్తోంది. మిడిల్ క్లాస్ పీపుల్ కు ఈ కారు ఎంతగానో నచ్చుతుంది.