Manual vs automatic car: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఒక చిన్న పొరపాటు తర్వాత పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. అందుకే కారు కొనేటప్పుడు కేవలం ఇష్టంతో కాకుండా నిజంగా ఏది అవసరమో చూసి నిర్ణయం తీసుకోవాలి. ముందుగా బడ్జెట్ ఎంత, కారు ఎందుకు కావాలి, ఎలాంటి అవసరాలు ఉన్నాయి అని ఆలోచించుకుని, ఆ తర్వాత సరైన మోడల్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు కొత్తగా కారు కొనేవారికి ఆటోమేటిక్ కారు తీసుకోవాలా? లేదా మ్యాన్యువల్ కారు తీసుకోవాలా? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదలుతుంది. దీనికి సరైన సమాధానం తెలుసుకోవాలంటే ఆటోమేటిక్ కార్ల వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది సరిగ్గా అర్థం చేసుకోవాలి.
ఆటోమేటిక్ కార్ల వల్ల లాభాలు
డ్రైవింగ్ చాలా ఈజీ
ఆటోమేటిక్ కార్లలో క్లచ్ ఉండదు. అలాగే, గేర్లు కూడా దానంతట అవే మారుతాయి. దీనివల్ల భారీ ట్రాఫిక్‌లో కూడా కారు నడపడం చాలా సులువుగా ఉంటుంది. సిటీలో రోజువారీ ప్రయాణాలకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.
డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది
గేర్లు దానంతట అవే మారతాయి కాబట్టి ఎటువంటి ఝలక్ లేకుండా డ్రైవింగ్ చాలా సౌకర్యంగా, స్మూత్‌గా ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించినా అలసట తక్కువగా ఉంటుంది.
Also Read: ఈ ఒక్క నెంబర్ ను టైప్ చేస్తే.. పిఎఫ్ డీటెయిల్స్ 30 సెకండ్లలో తెలిసిపోతాయి..
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి మంచిది
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్లకు, మ్యాన్యువల్ గేర్లు మార్చడం కష్టంగా అనిపించే వారికి ఆటోమేటిక్ కార్లు చాలా మంచి ఆప్షన్. గేర్ల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు కాబట్టి, డ్రైవింగ్ ఈజీగా వస్తుంది.
అలసట తక్కువ
సిటీ ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మార్చడం, క్లచ్ నొక్కడం వల్ల డ్రైవర్‌కు చాలా అలసట వస్తుంది. ఆటోమేటిక్ కార్లలో ఈ శ్రమ ఉండదు కాబట్టి, ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు అలసట చాలా తక్కువగా ఉంటుంది.
ఆటోమేటిక్ కార్ల వల్ల నష్టాలు
ధర ఎక్కువ
మ్యాన్యువల్ కార్లతో పోలిస్తే ఆటోమేటిక్ కార్లు కొంచెం ఖరీదైనవి. ఎందుకంటే వీటిలో కొత్త టెక్నాలజీ వాడుతారు. అందుకే వీటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.
మెయింటెనెన్స్ ఎక్కువ
ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రిపేర్ చేయించడం, దానిని మెయింటెయిన్ చేయడం మ్యాన్యువల్ కార్ల కంటే కొంచెం ఖరీదైన పని.
Also Read: ఆరు నెలల్లో లక్షల ఉద్యోగాలు కోత.. టెక్ రంగంలో ఎందుకీ సంక్షోభం.?
గేర్‌లపై కంట్రోల్ ఉండదు
డ్రైవర్‌కు గేర్లు మార్చడంపై కంట్రోల్ ఉండదు. స్పోర్టీ డ్రైవింగ్ అంటే ఇష్టపడే వాళ్లకు ఇది పెద్ద మైనస్ పాయింట్ అవ్వొచ్చు. ఎందుకంటే, కొన్నిసార్లు తమకు నచ్చిన విధంగా గేర్లు మార్చడానికి కుదరదు.
ఎలా నిర్ణయం తీసుకోవాలి?
మొత్తంగా చూస్తే, ఆటోమేటిక్ కార్లకు లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. ఈజీ డ్రైవింగ్, సిటీలో రోజువారీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే, ఆటోమేటిక్ కారు కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్, తక్కువ ఖర్చు, గేర్‌లపై కంప్లీట్ కంట్రోల్ కావాలనుకుంటే, మ్యాన్యువల్ కారు బెస్ట్ ఆప్షన్.