Tata Safari EV : ప్రస్తుత కాలంలో ఈవీల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా కొత్త కారు కొనాలని అనుకునేవారు ఎలక్ట్రిక్ వేరియంట్ పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని చాలా కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్తగా ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా Tata కంపెనీ నుంచి 2031 వరకు మొత్తం ఆరు కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇందులో రెండు కార్లు ముందుగా రిలీజ్ కానున్నాయి. వీటిలో ఉండే ఫీచర్స్ గురించి రిలీజ్ కావడంతో చాలా మంది వీటి గురించి ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఈ కార్లు ఎలా ఉండబోతున్నాయంటే?
టటా కంపెనీ నుంచి కొత్తగా Safari Ev రాబోతుంది. దీనిని పండుగ సీజన్ అయిన దీపావళికి మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇందులో 65 కిలో వాట్ నుంచి 75 కిలో వాట్ బ్యాటరీ కెపాసిటి ఉండే అవకాశం ఉంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 622 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. వీటిలో బ్యాటరీతో పాటు సేప్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. అడాస్ తో పాటు 540 డిగ్రీల కెమెరా వంటి సదుపాయాలు ఉన్నాయి. ఏరో డైనమిక్, అల్లాయ్ వీల్స్ తో డిజైన్ ఆకట్టుకోనుంది. మొత్తంగా ఈ కారు ఇప్పుడున్న సఫారీ మాదిరిగానే ఉండనుంది. కానీ కొత్త కారులో కొత్త సాఫ్ట్ వేర్లు చేర్చారు.
ఇదే కంపెనీ నుంచి మరో కారు Avinya Evరాబోతుంది. ఇందులో 65 నుంచి 80 కిలో వాట్ బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీకి 350 కిలో వాట్ డీసీ చార్జర్ ను అందించనున్నారు. ఇందులో ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి. ఎల్ ఈడీ లైట్లు, డీఆర్ఎల్స్, నిలువుగా అమర్చిన లైటింగ్ వంటివి ఆకట్టుకోనున్నాయి. పెద్ద అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ లైన్ వంటివి వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. అలాగే ఈ కారు మార్కెట్లోకి వస్తే SUVలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇతర కంపెనీలకు చెందిన కార్లు ఉన్నప్పటికీ ఎస్ యూవీ సెగ్మెంట్ లో టాటా కార్లు మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కంపెనీ నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు ఆకట్టుకోగా.. ఇప్పుడు ఈవీ వేరియంట్ లోనూ తనదైన సత్తా చాటే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంటున్నారు.