Homeలైఫ్ స్టైల్healthy breakfast : ప్రతిరోజూ ఉదయం ఈ పాయసం తింటే.. మీది ఉక్కు శరీరమే.. ఎలా...

healthy breakfast : ప్రతిరోజూ ఉదయం ఈ పాయసం తింటే.. మీది ఉక్కు శరీరమే.. ఎలా తయారు చేయాలంటే..

healthy breakfast : ప్రస్తుత కాలంలో ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు చాలామందికి ఉంది. అయితే ఇంట్లో తయారు చేసుకునే సమయం లేక హోటళ్లలో తింటూ ఉన్నారు. కానీ ఇందులో రకరకాల ఆహార పదార్థాలను కలపడం వల్ల కొంతమంది అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ఆరోగ్యంతో పాటు శరీరానికి మంచి శక్తి ఇచ్చే కొన్ని ఆహార పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మంచి పోషకాలు అందిస్తూ […]

healthy breakfast : ప్రస్తుత కాలంలో ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు చాలామందికి ఉంది. అయితే ఇంట్లో తయారు చేసుకునే సమయం లేక హోటళ్లలో తింటూ ఉన్నారు. కానీ ఇందులో రకరకాల ఆహార పదార్థాలను కలపడం వల్ల కొంతమంది అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ఆరోగ్యంతో పాటు శరీరానికి మంచి శక్తి ఇచ్చే కొన్ని ఆహార పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మంచి పోషకాలు అందిస్తూ శరీరానికి ఎలాంటి అనారోగ్యానికి గురిచేయకుండా ఉంచే ఈ ‘పాయసం’ను తయారు చేసుకోవాలని అంటున్నారు. దీని వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? దీనిని ఎలా తయారు చేసుకోవాలి?

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం కాస్త సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఆహారం రోజంతా శరీరంపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో అల్పాహారంగా నాణ్యమైన ఫుడ్ ను తీసుకోవాలి. ఇలాంటి వాటిలో ఈ పాయసం బెస్ట్ ఫుడ్ అని అంటున్నారు. బాదంపాలు, మఖానా, గోధుమ రవ్వతో తయారు చేసే దీనిని తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యం అని అంటున్నారు.

ఈ పదార్థాన్ని తయారు చేయడానికి ఒకరోజు ముందు 10 నుంచి 12 వరకు బాదం పప్పులను నానబెట్టాలి. ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ గసగసాలను విడిగా నానబెట్టాలి. ఉదయమే బాదం పప్పుపై ఉన్న పొట్టును తీసేసి వాటిని గసగసాలతో కలిసి గ్రౌండ్ చేయాలి. ఆ తరువాత ఒక పాత్రలో ఒక స్పూన్ నెయ్యిని వేసి ఒక కప్పు మఖానా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లో పక్కకు తీసుకోవాలి. ఇప్పటి వరకు మఖానాను వేయించిన పాత్రలోనే మళ్లీ ఒక స్పూన్ నెయ్యి వేసి గోధుమ రవ్వను వేసి రంగు మారేవరకు వేయించాలి. ఆ తరువాత మలై తీసిన పాలను తీసుకొని వేడాి చేయాలి. పాలు పొంగేవరకు వేచి చూసి ఆ తరువాత బాదంపప్పు, గసగసాల మిక్స్ ను వేసి కలపాలి. మీడియం మంటపై గోధుమ రవ్వను వేసి సాప్ట్ అయ్యే వరకు కలపాలి. చివరగా తీపి కోసం బెల్లాన్ని వేసుకోవచ్చు. చివరగా వేయించిన మఖాతో పాటు అరకప్పు యాలకులు వేసి కలుపుకోవాలి.

ఈ మిశ్రమం తయారు చేయడానికి కాస్త సమం పట్టినా.. ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యం అని నిపుణులు అంటున్నారు. వీటిలో ఉండే బాదంపప్పు, మఖానాతో పాటు గోధుమ రవ్వ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా త్వరగా ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper