Xiaomi Nomad Series : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ xiaomi.. వాహనాల తయారీలోనూ తిరుగులేని స్థాయిలో ఉంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్ యు వి సెగ్మెంట్లో షావోమి స్కై నో మాడ్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చైనాలో ఈ మోడల్ కి పెంగ్ చంగ్ అని పేరు పెట్టింది. షావోమీ తీసుకొచ్చిన ఈ మోడల్ కార్ ఒక ఇంటలిజెంట్ లాగా పని చేస్తూ ఉంటుంది. దీనిని రీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. పైగా ఇది భారీ స్పేస్ కలిగిన లగ్జరీ ఎస్ యు వి సిరీస్..
ఈ వాహనం లోపలి భాగాన్ని పూర్తిగా ప్లాట్ ఫ్లోర్ లాగా రూపొందించారు. సీట్లను ముందుకు వెనక్కి జరుపుకునే విధంగా పొడవైన స్లైడింగ్ రైల్స్ రూపొందించారు. దీనివల్ల కారు లోపల స్థలాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.
ఇది ఒక ఎక్స్టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ.. ఇందులో ఉండే 1.5l టర్బో పెట్రోల్ ఇంజన్ కేవలం జనరేటర్ మాదిరిగానే పనిచేస్తూ ఉంటుంది. బ్యాటరీని చార్జ్ చేస్తూ ఉంటుంది. పైగా ఇది భారీ రేంజ్ అందిస్తూ ఉంటుంది.
ఇందులో అత్యంత సురక్షితమైన ఆర్మర్ కేజీ బాడీ.. ఆర్మర్ స్కేల్ బ్యాటరీ ఉన్నాయి.
ఇక ఈ మోడల్ లో 2 వేరియంట్లు ఉన్నాయి..
స్కై నో మాడ్ ఎన్90 మాక్స్.. దీనిని కుటుంబాల కోసం రూపొందించారు. ఇది సెవెన్ సీటర్ ఫ్లాగ్ షిప్ ఎస్ యూ వీ. ఇది మన దేశ మార్కెట్లో సుమారు 35.5 లక్షలలో లభిస్తుంది. అయితే ఇది కేవలం ఢిల్లీ ఎక్స్ షోరూం ధర మాత్రమే. ఇతర ప్రాంతాలలో అయితే స్థానిక పన్నులు కలుపుకొని ఎక్కువగా ఉంటుంది..
స్కై నో మాడ్ ఎన్70 మాక్స్
ఇది ఆల్ వీల్ డ్రైవ్ కలిగిన 5 సీటర్ suv.. దీని ప్రారంభ ధర 30.7 లక్షలు..
ఈ మోడల్ కార్లలో సీట్లను దాదాపు 180 డిగ్రీల వరకు తిప్పొచ్చు. అవసరాన్ని బట్టి కారు లోపల భాగాన్ని ఆఫీస్ మీటింగ్ రూమ్ మాదిరిగా.. బెడ్ రూమ్ మాదిరిగా.. పిల్లల ఆట స్థానంగా కూడా మార్చుకోవచ్చు.
ఈ కార్లు కేవలం బ్యాటరీ మీద 505 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. పెట్రోల్ జనరేటర్.. 1705 కిలోమీటర్ల గరిష్ట రేంజ్ అందిస్తాయి.
ఇందులో షావోమి హైపర్ ఓఎస్.. హైపర్ షియా వోఐ అసిస్టెంట్.. అడ్వాన్స్డ్ లీడర్ ఆధారిత అటానమస్ డ్రైవింగ్ సిస్టం ఇందులో ఉన్నాయి.